సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ పై స్పందించిన బ్రహ్మానందం.. ఇలాగే కంటిన్యూ అయితే..

సోషల్ మీడియాలో ఈ రోజుల్లో మీమ్స్ అనేవి చాలా కామన్ గా మారాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే సరదాగా నవ్వుకోవడానికి మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే మీమ్స్ లలో ఎక్కువగా ఎవరి ఫేస్ వాడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బ్రహ్మానందం లేకుండా ఎవరు కూడా మీమ్ ను రెడీ చేయలేరు. ఇక నేడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఒక మీమ్స్ పై ఒక వివరణ ఇచ్చారు.

బ్రహ్మానందం 65

బ్రహ్మానందం 65

హాస్యబ్రహ్మగా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కమెడియన్ బ్రహ్మానందం. రెండు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి సినిమాలకు ఒక స్పెషజ్ క్రేజ్ ని అందించేవారు. నేడు ఆయన 65వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.

సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా కూడా

సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా కూడా

బ్రహ్మానందం అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా కూడా నేటితరం జనరేషన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ లలో సగానికి పైగా బ్రహ్మానందం స్టైల్ లోనే ఉంటాయి. ఆయన లేకుంటే మీమ్స్ ఈ రేంజ్ లో వచ్చేవా అని ఒక టాక్ కూడా వైరల్ అయ్యింది.

తొలిసారిగా మీమ్స్ పై స్పందించిన కామెడీ కింగ్

తొలిసారిగా మీమ్స్ పై స్పందించిన కామెడీ కింగ్

అయితే తొలిసారిగా బ్రహ్మానందం తనపై వచ్చే మీమ్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. కొంతమంది. మీమ్స్ క్రియేట్ చేసేవారు బ్రహ్మానందం దగ్గరకు వెళ్లగా చాలా సంతోషంగా మాట్లాడారు. ఇలానే మనం కంటిన్యూ అవుతూ ప్రతి ఒక్కరినీ సరదాగా నవ్వించే ప్రయత్నం చేద్దామని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ తాను కూడా చూసి ఎంజాయ్ చేస్తానని అన్నారు.

మెగాస్టార్ కూడా వాటి గురించి చెప్పారు

మెగాస్టార్ కూడా వాటి గురించి చెప్పారు

మీమ్స్ గురించి మెగాస్టార్ కూడా మాట్లాడుతూ ఉంటారని నీ ప్రతి సినిమాలో ఉన్న చిన్న చిన్న హావభావాలను గుర్తు పెట్టుకొని మరి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారని చాలా బావున్నాయి అంటూ మెగాస్టార్ తనకు చెప్పినట్లు బ్రహ్మానందం వివరణ ఇచ్చారు. ఇక అభిమానుల నుంచి వచ్చిన కొన్ని కానుకలను కూడా అందుకున్న బ్రహ్మానందం వారితో ఫొటోలు కూడా దిగారు.

Recommended Video

Brahmanandam Turns 65 | హీరోలని డామినేట్ చేసిన One & Only కమెడియన్
ఆరు పదుల వయసులో కూడా..

ఆరు పదుల వయసులో కూడా..

ఇకపోతే గత రెండేళ్లకు ముందు వరకు కూడా బ్రహ్మానందం చాలా బిజీగా ఉండేవారు. ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా కనిపించేవారు. వెయ్యి సినిమాలకు పైగా చేసిన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన స్టైల్ కు తగ్గట్లు పాత్రలు రావడం లేదు. కరోనా మొదలైనప్పటి నుంచి కూడా బ్రహ్మానందం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఆయన ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X