For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెమెరామేన్ తో వియ్యమొందుతున్న బ్రహ్మానందం...!?

    By Sindhu
    |

    బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా సినిమాలు చేసినప్పటికీ...ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో అతని కెరియర్ ఊపందుకోలేకపోయింది. కాగా గౌతమ్ హీరోగా మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. అభి పిక్చర్స్ పతాకంపై బి. సత్యనారాయణ నిర్మించే ఈ చిత్రంతో రామ్‌ రాజ్‌వర్మ దర్శకునిగా పరిచయమవుతున్నారు. విజయదశమి రోజున సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే...నవంబర్‌ లో సినిమాని లాంఛనంగా ప్రారంభించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్‌ గా షూటింగ్ మొదలు పెట్టి సమ్మర్‌ లో సినిమా విడుదల చెయ్యనున్నారు.

    మంచు విష్ణు, అల్లు అర్జున్, రామ్ చరణ్... వీళ్ల కోవలోకి ఇప్పుడు యంగ్ హీరో, హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కూడా చేరుతున్నాడు. తనతో బాటు చదువుకున్న తన స్నేహితురాల్ని గౌతమ్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

    తాజాగా ఈ కుర్ర హీరోకి కూడా ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ కెమెరామేన్ శ్రీనివాసరెడ్డి కుమార్తె, గౌతమ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారనీ, వీరి పెళ్లికి ఇటు బ్రహ్మానందం.. అటు శ్రీనివాసరెడ్డీ ఇద్దరూ అంగీకరించారని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో వీరి వివాహం హైదరాబాదులో వైభవంగా జరుపడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లయ్యాక గౌతమ్ దశ తిరుగుతుందని ఆశిద్దాం!

    English summary
    Bramhanandam accepted love marriage of his son...The super talented Brahmanandam is currently an anxious father and that too for two reasons. Apparently, his son Gautham is making a comeback of sorts with a new movie and more than that, Brahmi seems to be keeping an eye over Gautham’s heart.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X