గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న ఆ స్టార్ ఎవరో తెలుసా?

By Bojja Kumar

Recommended Video

గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న ఆ స్టార్ ఎవరో తెలుసా?

ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు గుండు హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. హనుమంతరావు మరణంతో అతడి తనయుడు ఆదిత్య శోకసముద్రంలో మునిగి పోవడం అందరినీ కలిచి వేసింది. ఇప్పటికే తల్లిని, సోదరిని కోల్పోయిన ఆదిత్య ఇపుడు తండ్రి మరణంతో మరింత కృంగిపోయాడు. ఎవరూ లేని అనాదగా మారిన ఆదిత్యను ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం చర్చనీయాంశం అయింది.

 దత్తత తీసుకున్న ఆ స్టార్ ఎవరు?

దత్తత తీసుకున్న ఆ స్టార్ ఎవరు?

గుండు హనుమంతరావు తనయుడు ఆదిత్యను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆ స్టార్ మరెవరో కాదు.... టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం. గుండు హనుమంతరావుకు అత్యంత సన్నిహితుల్లో బ్రహ్మానందం ఒకరు.

ఆ బాధ్యతలు నేనే చూసుకుంటాను

ఆ బాధ్యతలు నేనే చూసుకుంటాను

ఆదిత్య చదువు బాధ్యతలతో సహా అతడి పెళ్లి బాధ్యతలు తానే దగ్గకుండి చూసుకుంటానని బ్రహ్మానందం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. హనుమంతు కొడుక తన కొడుకుతో సమానమని, అతడికి ఏ లోటూ రాకుండా చూసుకుంటానని బ్రహ్మీ చెప్పినట్లు సమాచారం.

ఆదిత్య సెటిలయ్యే వరకు

ఆదిత్య సెటిలయ్యే వరకు

ఆదిత్య బాగా చదువుకుని, ఏదైనా ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యే వరకు తన తోడ్పాటు ఉంటుందని, ఈ విషయంలో ఆదిత్య ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రహ్మానందం భరోసాఇచ్చారట.

బ్రహ్మానందం మీద అపోహ

బ్రహ్మానందం మీద అపోహ

ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బ్రహ్మానందం మీద ఓ అపోహ ఉంది. అతడు ఎంత సంపాదించినా ఎవరికీ ఒక్కరూపాయి కూడా ఇవ్వరని కొందరు అంటుంటారు. మరి తాజా సంఘటనతో అయినా అలా అనేవారి నోళ్లు మూతపడతాయని ఆశిద్దాం.

ఏడ్చేసిన బ్రహ్మానందం

ఏడ్చేసిన బ్రహ్మానందం

ఇటీవల గుండు హనుమంతరావు మరణవార్త విన్న వెంటనే బ్రహ్మానందం ఆయన నివాసానికి చేరుకుని తన స్నేహితుడుని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.

 30 ఏళ్ల అనుబంధం

30 ఏళ్ల అనుబంధం

గుండు హనుమంతరావుతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని, మొదటిసారి ‘సత్యాగ్రహం' అనే సినిమాలో నటించామని, ‘అహనా పెళ్లంట' మాకు వచ్చిన పెద్ద బ్రేక్ అని బ్రహ్మానందం ఇటీవల వల్లడించారు.

బావా బావా అని పిలిచేవాడు

బావా బావా అని పిలిచేవాడు

తాము సహనటులుగా ఉండటం కంటే తమ మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండదని, బావా బావా అని పిలుస్తుండే వాడని, నాకున్న అతి కొత్త మంది సన్నిహితులైన మిత్రుల్లో గుండు హనుమంతరావు ఒకరని బ్రహ్మానందం ఇటీవల వెల్లడించారు.

 గుండు కొడుకు ఆదిత్య ఎంత మంచోడంటే..

గుండు కొడుకు ఆదిత్య ఎంత మంచోడంటే..

తల్లి దండ్రులను పెద్దగా పట్టించుకోని కొడుకులున్న ఈ రోజుల్లో..... గుండు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన తనయుడు ఆదిత్య ఇంట్లోనే ఉండి తండ్రికి సేవలు చేస్తూ గడిపారు. ఈ రోజుల్లో ఇలాంటి కొడుకు ఉండటం చాలా అరుద అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X