జూ ఎస్టీఅర్ రక్తంలోనే నటన..బ్రహ్మానందం

By Srikanya

"ఎన్టీఆర్‌ రక్తంలోనే నటన ఉంది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే మెప్పించగలడు" అని బ్రహ్మానందం ప్రశంసించారు. అదుర్స్ విజయోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. అలాగే తను ఈ చిత్రంలో నటించే అవకాశం రావటం తన అదృష్టమన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్..బ్రహ్మానందం గురించి..బ్రహ్మానందంని యాక్టింగ్‌లో కానీ, కామెడీలో కానీ డామినేట్‌ చేసేవాళ్లెవరూ లేరు. నా వల్ల కూడా కాద మెచ్చుకున్నారు. అలాగే చారి అనే గొప్ప క్యారెక్టర్‌ ని రచయిత కోన వెంకట్‌తో కలిసి డిజైన్‌ చేసి అద్భుతంగా నా చేత చేయించాడు వినయ్‌ అన అంటూ వినాయిక్ ని మెచ్చుకున్నారు. నిర్మాత వల్లభనేని వంశీ మాట్లాడుతూ..."నందమూరి వంశానికి నేను, కొడాలి నాని వీరాభిమానులం. నేనైతే ఎన్టీఆర్‌ చిత్రాలను నేల మీద, బెంచీల్లో కూర్చొని చూసిన రోజులున్నాయి. ఎన్టీఆర్‌తో సినిమా తీస్తే పెద్దాయనతో తీసినట్టే ఉంది. ప్రజలు ఘన విజయాన్ని అందించారు. ప్రాంతీయ భావాలకు అతీతంగా చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు" అన్నారు.

దర్శకుడు వినాయక్‌ మాట్లాడుతూ "సినిమా విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. చారి పాత్రలో ఎన్టీఆర్‌ తప్ప మరెవరూ అంత బాగా కనిపించరు. పాటలు, నృత్యాలు, సెట్‌లు, ఫైట్‌ లు..ఒకటేమిటి అన్ని విభాగాల కృషి తెరమీద కనిపిస్తూనే ఉంది. ప్రమాదం తరవాత ఎన్టీఆర్‌ నృత్యాలు చేయగలుగుతారా? అనే సందేహం ఉన్నవారికి మా సినిమా సమాధానం అవుతుంది. వినోదాన్ని ప్రజలు ఆస్వాదిస్తుంటే ఆనందంగా ఉందని" అన్నారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు వినాయక్‌, నిర్మాత వంశీమోహన్‌, నటులు బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, మాటల రచయిత కోన వెంకట్‌, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు, ఫైట్‌ మాస్టర్లు రామ్‌-లక్ష్మణ్‌, గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి, నల్లమలుపు బుజ్జి పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X