బ్రహ్మీ... ‘అందరమ్మాయిలతో’(ఫన్నీ ఫోటో)
హైదరాబాద్: బ్రహ్మానందం ఫేసు మార్పింగ్ చేస్తూ పలువురు హీరోలను, ప్రముఖులను, కొత్త సినిమాలను ఆట పట్టించడం గత కొంత కాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం కామెడీని ఇష్టపడే కొందరు బ్రహ్మీ పేరుతో, ఫేసుతో పలు పేరడీలు చేస్తూ నెటిజన్లకు వినోదం పంచుతున్నారు.
అల్లు అర్జున్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇటీవల శివరాత్రిని పురస్కరించుకుని విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మీ అభిమానులు ఆ సినిమాపై పేరడీ వదిలారు. అరిటాకుల ప్రొడక్షన్స్, ఇడ్లీ విశ్వనాథ్ ఫిల్మ్.... బ్రహ్మీ 'అందరమ్మాయిలతో' అంటూ అంటూ ఓ ఫోటోను నెట్లోకి వదిలారు. ఇప్పుడు ఇది ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.
అయితే ఇలాంటి చర్యలపై బ్రహ్మానందం కొన్ని నెలల క్రితం స్పందించారు. 'ఫేస్ బుక్ మెంబర్స్‌కి నా అభ్యర్థన... మీరు నామీద ఎన్ని జోకులయినా వేసుకోండి... కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోండి... నాకేం బాధ లేదు... ఎందుకంటే నేను పుట్టిందే మిమ్మల్ని నవ్వించడానికి... కానీ నా పేరు పెట్టుకుని ఇతరులను మాత్రం దయచేసి అవమానించకండి... అది నన్ను తీవ్రంగా బాధిస్తోంది... నేను ఎప్పుడూ అలా కోరుకోను... నా అభ్యర్థనను పెద్ద మనసుతో ఆలకిస్తారని భావిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు.
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రాబోతున్న 'జెఫ్పా చిత్రం వివరాల్లోకి వెళితే.. చప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు లాస్ట్ స్టేజ్‌కు చేరుకున్నాయని, ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయని... త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు శ్రావణ్, అలి, ఫిష్ వెంకట్ ముఖ్య మైన పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











