'గచ్చిబౌళి దివాకర్' గా బ్రహ్మానందం

ఇక ఈ సినిమాలో సిద్దార్ద..ఎంబిఎ చదివిన కుర్రాడు సిద్దుగా కనపడతాడు. తమన్నా...పల్లెనుంచి చదువుకోవటానికి హైదరాబాద్ వచ్చిన గీతగా కనిపిస్తుంది. మరో సిద్దార్ధ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపిస్తారు. రమ్యకృష్ణ..హీరో తల్లిగా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కథ మొత్తం రిలేషన్ షిప్స్ చుట్టూ తిరుగుతుందంటున్నారు దర్శకుడు. తన స్నేహితులు, కజిన్స్ కుటుంబాల్లో చూసిన భాంధవ్యాలనే చూపనున్నట్లు చెప్తున్నారు. ఒక వ్యక్తి స్వార్ధపరుడై, భాధ్యతలు లేని వ్యక్తిగా ఉంటే...అతనితో అనుబంధం ఉన్న సమాజం ఎలా ఇబ్బంది పడుతుందో చూపెట్టానంటున్నాడు. మానవ జీవితంలో తరుచుగా సంభవించే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కథని రూపొందించానంటున్నారు. బెస్ట్ ఆప్ లక్ కిషోర్, బ్రహ్మి అంట్ హోల్ టీమ్.


Click it and Unblock the Notifications











