ఇక బ్రహ్మానందం గేమ్
ఇప్పటి వరకూ సినిమాల్లోకామెడీ తో ఆడుకున్న బ్రహ్మానందం త్వరలో ఓ గేమ్ షో లో కనపడనున్నాడని సమాచారం. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ వారు బ్రహ్మానందం హోస్ట్ గా ఒక గేమ్ షోని ప్రారంభిస్తున్నారుని సమాచారం..అలాగే ఈ గేమ్ షో కి ప్రైజ్ మనీ కూడా గట్టి గానే పెట్టి నట్లు చెప్తున్నారు. ఈ షో లో పాల్గొని గెలుపొందిన వారికి పది లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇక ఈ ప్రొపొసల్ కి బ్రహ్మానందం ని ఒప్పించేదుకు గాను ఆ ఛానల్ వారు బ్రహ్మానందానికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ గేమ్ షో లో భాగంగా బ్రహ్మానందం కొన్ని జోక్స్ చెపుతూ ఆనంద పరుస్తారు. నవ్వులుతోనే ఈ షో క్లిక్ చేయాలనీ చానల్ వారు భావిస్తున్నారు. సినిమాలలోను ఈ మద్య దుమ్ము రేపుతున్న బ్రహ్మం బుల్లి తెరను సైతం నవ్వులతో ముంచెత్తుతాని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











