విసు ఫిలిమ్స్ పతాకంపై సి.సి.రెడ్డి నిర్మిస్తున్న మూకీ చిత్రానికి గోకరాజు అనే పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి ముఖ్యపాత్రలోనూ,బ్రహ్మానందం గోకరాజు గా ప్రధాన పాత్రలోనూ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా లో బ్రహ్మానందం ట్రైబర్ గ్రామాలనుంచి వచ్చి ముఖ్యమంత్రిని కలసి తమ కష్టాలు చెప్పుకుంటుంది. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటం,ప్రభుత్వ పథకాల గొప్పతనం ఇందులో ఉంటుంది. అలాగే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో తమ్ముడు చిత్రం రూపొందించిన అరుణ్ ప్రసాద్ డైరక్ట్ చేస్తున్నారు. అరుణ్ ప్రసాద్ గతంలో సి.సి.రెడ్డి నిర్మాతగా గౌతమ్ ఎస్.ఎస్.సి అనే సినిమాను తీసి ఉన్నాడు.