హన్సికను పడేయటానికి బ్రహ్మానందంని..
హైదరాబాద్ : లవ్ గురు గా బ్రహ్మానందం చెప్పే ప్రేమ పాఠాలతోనే హన్సికను పడేసాను అంటున్నారు సిద్దార్ద. సిద్దార్ధ తాజా చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. ఈ చిత్రంలో సిద్దార్ద ప్రేమ అంటే గిట్టని కుర్రాడిగా కనిపిస్తాడు.
అయితే అంతవరకు ప్రేమ అంటే గిట్టని ఆ కుర్రాడు ఓ అందాల భామ హన్సికని చూసి మనసు పారేసుకొంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. ప్రేమ పాఠాల కోసం ఓ గురువును ఆశ్రయిస్తాడు. ఆయనే బ్రహ్మానందం. ఆయన గారి పాఠాలు సినిమాలో కామెడీని పండిస్తాయంటున్నారు.
సుందర్.సి. దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. సిద్ధార్థ, హన్సిక జంటగా నటించారు. బి.సుబ్రహ్మణ్యం, ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. రానా, సమంత అతిథి పాత్రలు పోషించారు. ఖుష్బు ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ప్రేమ కథ ఇది. సిద్ధార్థ, హన్సికల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకొంటాయి. ప్రేమ పాఠాలు చెప్పే గురువుగా బ్రహ్మానందం కనిపిస్తారు. ఈ నెల 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''తెలుగులో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకొంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ప్రేమ, వినోదం, కుటుంబ అనుబంధాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బ్రహ్మానందం ప్రేమ్‌జీ అనే లవ్‌గురు పాత్రలో కనిపిస్తారు. ఆయన దగ్గర సిద్ధార్థ్ ప్రేమ పాఠాలు నేర్చుకొనే విధానం వినోదం పంచుతుంది''అన్నారు.
అనువాదచిత్రాల నిర్మాతగా పేరు గాంచిన శ్రీలక్ష్మీగణపతి పిక్చర్స్ సంస్థ అధినేత బి.సుబ్రహ్మణ్యం తొలి ప్రయత్నంగా ఎన్.సురేష్‌తో కలిసి నిర్మిస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. ఈ చిత్రంలో సుధ, వేణుమాధవ్, గౌతంరాజు, గణేష్ వెంకటరామన్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్, సంగీతం: సత్య, పాటలు: వనమాలి.


Click it and Unblock the Notifications











