శ్రీనువైట్ల 'నమో వెంకటేశ' లో బ్రహ్మానందం పాత్ర
శ్రీను వైట్ల సినిమాలలో మొదటి నుంచీ బ్రహ్మానందంకు ఓ ప్రత్యేక పాత్ర ఉంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సారి శ్రీనువైట్ల,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న నమో వెంకటేశ చిత్రంలో కూడా బ్రహ్మానందం ప్యారిస్ ప్రసాద్ అనే పాత్ర చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని టోటల్ సినిమాలో వెంకటేష్ కున్నంత రోల్ బ్రహ్మానందంకు ఉంటుంది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిక్వాలిజం చేస్తూ కనపడతారు. అతను విదేశాలలోను తెలుగు వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లతాడు. అక్కడ బ్రహ్మానందం కలుస్తాడు. అతని మేనకోడలు త్రిష. ఇక వీరిని ఆహ్వానించి,అక్కడ పోగ్రామ్ లు చూసే ఆర్గనైజర్ గా బ్రహ్మానందం బిల్డప్ లు ఇస్తూ వెంకటేష్ తో ఆడుకుంటాడు. పూర్తి స్ధాయి కామిడీ పండిస్తాడు. ముఖ్యంగా సెకెండాఫ్ లో బ్రహ్మానందం, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హిలేరియస్ గా ఉంటాయని,రెగ్యులర్ గా శ్రీనువైట్ల సినిమాల్లో ఉండే త్రాగుడు సీన్ కూడా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా వెంకటేష్ మరో సూపర్ హిట్ కు రెడీ అవుతున్నాడన్నమాట. ప్రస్తుతం ఈ చిత్రం ఎనభై ఐదు శాతం షూటింగ్ పూర్త చేసుకుంది. సంక్రాతికి దీనిని రిలీజ్ చేసి నవ్వులు పండించనున్నారు.


Click it and Unblock the Notifications











