ఇద్దరమ్మాయిలతో...‘ఫిడేల్ బ్రహ్మా’గా బ్రహ్మీ
హైదరాబాద్ : ఒక్కో సినిమాలో ఒక్కో వెరైటీ గెపట్‌లో, వెరైటీ క్యారెక్టరైజేషన్తో నవ్విస్తూ వస్తున్న టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం....తాజాగా 'ఇద్దరమ్మాయిలు' చిత్రంలో మరో సరికొత్త పాత్రతో నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం 'ఫిడేలు బ్రహ్మా'గా మ్యూజిక్ టీచర్ పాత్రలో నవ్వించనున్నాడు.
ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ గిటార్ వాయిద్యకారుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. హీరోకు పోటీగా బ్రహ్మానందం....ఫిడేలు వాయిద్య కారుడిగా, ఫిడేలు బ్రహ్మా పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు.
ఈ చిత్రంలో ఆయన వేషధారణ పంచెకట్టుతో కామెడీని పండించే విధంగా ఉండనుంది. మరి ఇంకే...రేపు(మే 31) విడుదల కాబోతున్న 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూసి బ్రహ్మీ కామెడీని ఎంజాయ్ చేయండి. అల్లు అర్జున్, ఆమలాపాల్, కేథరిన్ ప్రధానపాత్రధారులుగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: అమూల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.

ఇద్దరమ్మాయిలో చిత్రంలో బ్రహ్మీ, అలీలకు సీన్ వివరిస్తున్న పూరి

నిర్మాత బండ్ల గణేష్ తో బ్రహ్మానందం, బ్రహ్మానందం..గణేష్ మధ్య మంచి అనుబంధం ఉందనడానికి ఈ ఫోటోయే నిదర్శనం

ఇద్దరమ్మాయిలతో చిత్రంలో బ్రహ్మానందం గెటప్ ఇదే. ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా ఫన్నీగా ఉండబోతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ అమలపాల్ బ్రహ్మానందం దగ్గర సంగీతం నేర్చుకునే వ్యక్తిగా కనిపించనున్నట్లు సమాచారం.

ఇద్దరమ్మాయిలతో చిత్రంలో బ్రహ్మీనందం, అల్లు అర్జున్, అమలా పాల్ మధ్య ఫన్నీ సన్నివేశం


Click it and Unblock the Notifications











