‘రామనాథ చౌదరి’గా నవ్వించనున్న బ్రహ్మానందం
హైదరాబాద్: మంచు విష్ణు కథానాయకుడిగా దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో ‘ఎర్రబస్సు' పేరుతో ఓ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విమల్, లక్ష్మీమీనన్, రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ హిట్ చిత్రం మంజ పై ఈ చిత్రానికి ఆధారం. తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విష్ణుకు తాతగా దాసరి నారాయణరావు కనిపించబోతున్నారు. మంచు విష్ణు సరసన కేథరిన్ హీరోయిన్.
ఈ చిత్రంలో టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం నవ్వులు సరికొత్త పాత్రలో నవ్వులు పూయించబోతున్నారు. ఆయన ఈచిత్రంలో రామనాథ చౌదరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచాం. సినిమాలో కామోడీ మసాలా బాగా దట్టించేందుకు ఆయన పాత్రను నవ్వులు పూయించేలా డిజైన్ చేసారని తెలుస్తోంది. ఇటీవలే బ్రహ్మీకి సంబంధించిన సీన్లు కూడా చిత్రీకరించారు. సినిమాలోని ఓ సీన్లో కాకులతో కయ్యం పెట్టుకునే చౌదరిగా బ్రహ్మానందం ప్రేక్షకులను భలే నవ్విస్తాడని అంటున్నారు.

దాసరి నారాయణరావు దర్శకుడిగా 151వ సినిమా ఎర్రబస్సు'. కథ విషయానికొస్తే... నేటి జీవనంలో బంధాలు, అనుబంధాలు అనుమానాస్పదంగానూ, ప్రశ్నార్థంకానూ మారిపోతున్నాయి. ఏదో తెలీని కృత్రిమత్వం చోటుచేసుకుంటుంది. కుటుంబంలో అందమైన కోణం తాతామనవడు బంధం. దాన్ని చక్కటి దృశ్యకావ్యంగా దాసరి తెరకెక్కిస్తున్నారు. కాగా, తొలిసారిగా దాసరి చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నామనీ, ఈ నెలాఖరులో ఆడియోను విడుదల చేయనున్నామని దాసరి చెప్పారు.


Click it and Unblock the Notifications











