పవన్-త్రివిక్రమ్ మూవీలో రియల్ ఎస్టేట్ దాదాగా బ్రహ్మీ!

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం కాంబినేషన్ అంటే నవ్వుల పూవులు పూయాల్సిందే. వీరి కాంబినేషన్‌కు త్రివిక్రమ్ లాంటి వారు అందించే పంచ్ డైలాగులు తోడైతే థియేటర్లో నవ్వుల జడివాన కురవాల్సిందే. ఆ నవ్వుల వాన ఏ రేంజిలో ఉంటుందే జల్సా సినిమా చూసిన వారికి తెలుసు.

ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సరదా(తాత్కాలిక టైటిల్) చిత్రం బ్రహ్మానందం పాత్ర ఏమిటో బయటకు లీకైంది. ఈచిత్రంతో బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Pawan kalyan-Brahmanandam

ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం మార్చి 1 నుంచి సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' మూవీ మంచి కామెడీ పండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X