భలే బ్రహ్మానందం! త్రిషాకే పోటినా??
లేడీస్ కే కాదు జెంట్స్ కూడా ఒక రేటు అంటూ వుంటుంది అదెలాగో తెలుసా ఆ హీరోయిన్ ఇంత తీసుకొన్నది, ఆ హీరోయిన్ అంత తీసుకొన్నది అని పలు వెబ్ సైట్స్ లో వెలువడుతుంటాయి. అయితే హీరోలకైతే వారి వారి ఫ్యాన్స్ ను బంటి వారికి ఒక పెద్ద మార్కెటే వుంటుంది. మరైతే కమేడియన్స్ పరిస్థి ఏంటో? కామీడీ లేకపోతే అది సినిమానే కాదు. సినిమాలు చూసేది ఎమోషన్ కోసం కాదు, ఎంటర్ టైన్ మెంట్ కోసం కాదు. 3 గంటల పాటు ఏ బాదరా బందీ లేకుండా సినిమా చూస్తూ రిలాక్స్ అవ్వడానికి అన్న విధంగా కామిడీని జత చేసి తీసే సినిమాలు తీస్తే ఆ సినిమాలు చూసిన ప్రేక్షలు థియేటర్ నుండి బయటికొచ్చొసరికి వారి మోహంలో నవ్వులు, ఆనందం కనిపిస్తాయి. అదే ఫ్రాక్షనిజం, ఎమోషన్ చిత్రాలు చూసే ప్రేక్షకులలో ఏదో బోర్ అనిపిస్తుంది. సో అంతటి ఆనందాన్ని పండించి కడుపుబ్బా నవ్వించే కమెడియన్ప్ కివ్వాలి హై రెమ్యూనరేషన్.
పద్మ శ్రీ అవార్డు గ్రహిత డా. బ్రహ్మానందం గారు తెలుగు సినిమాలో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించడంలో ఆయనకు సాటిలేరు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చేసిన ఆయన రేమ్యునేరేషన్ ఎంతో ఎవరికీ తెలియదు. అయితే తాజాగా వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న 'నమో వేంకటేశ" సినిమాలో బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. టాలీవుడ్ లో త్రిష స్లిమ్ బ్యూటి అయితే బ్రహ్మీ సౌట్ కామిడీ యాక్టర్. త్రిష అందలాతో ఆడియన్స్ కి మంచి ఎన్ టైన్ మెంట్ ఇస్తే బ్రహ్మీ ప్రేక్షకులకు తన కామిక్ తో మంచి ఆనందాన్ని పంచుతారు. ఇంతకీ ఏమిటంటే ఈ సినిమాకి బ్రహ్మానందం గారు 80 లక్షలు రేమ్యునేరేషన్ తీసుకుంటున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రంహ్మీనే అత్యదిక రెమ్యూనరేషన్ తీసుకొంటున్నది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమా హీరోయిన్ త్రిష కూడా 80 లక్షలు రేమ్యునేరేషన్ తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











