Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
షాక్ ఇస్తున్న బ్రహ్మానందం ఆస్తుల లెక్కలు.. రెమ్యునరేషన్ వాళ్ల కంటే ఎక్కువ..
టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా కామెడీ కింగ్ మాత్రం ఒక్కరే. ఆయనే నవ్వుల రారాజు బ్రహ్మానందం. పాత్ర ఏదైనా సినిమా ఎలాంటిదైనా సరే బ్రహ్మీ ఉన్నారు అంటే సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చాలా వరకు బ్రహ్మానందం లేకుండా తెరకెక్కేవి కావు. ఇక బ్రహ్మానందం ఆస్తుల లెక్కలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఒకసారి ఆ విషయంలోకి వెళితే..
గిన్నిస్ రికార్డ్ అందుకున్న కామెడీ కింగ్
దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్న బ్రహ్మానందం ఏ యాక్టర్ లేనంత బిజీ కమెడియన్ గా ఉండేవారు. ఆయన కోసం స్పెషల్ గా డేట్స్ మార్చుకున్న హీరోలు కూడా ఉన్నారు. బ్రహ్మి కాంబినేషన్ లో నటించడానికి అగ్ర హీరోలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకే వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. అలాగే పలు ప్రఖ్యాత అవార్డులు కూడా అందుకున్నారు.
హీరోయిన్స్ కంటే ఎక్కువే..
అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే కమెడియన్స్ లో బ్రహ్మానందం ఒకరు. డైలీ పేమెంట్స్ తీసుకునే ఆయన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారని ఇండస్ట్రీలో టాక్. రేపటి గురించి ఆలోచించి డబ్బును ఆదా చేసుకోవడంలో ఎలాంటి మొహమాటం లేదని అంటుంటారు. ఇక ఆయన రెమ్యునరేషన్ కొంతమంది హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఉండేదట.
కొన్నిసార్లు కోట్లు దాటేదట..
డైలీ పేమెంట్స్ లా తీసుకుంటే కొన్నిసార్లు బ్రహ్మానందం రెమ్యునరేషన్ కోట్లు దాటేదట. కొన్నిసార్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయట. కొందరు దర్శకులైతే బ్రహ్మానందం బిజీగా ఉంటే ఆయన కాల్షీట్స్ కోసం సినిమా షెడ్యూల్స్ ని సైతం మార్చేసేవారట. అంత డిమాండ్ ఉన్న బ్రహ్మానందం గత ఎడాది ఆరోగ్య కారణాల వల్ల సినిమాలను కొంత తగ్గించారు.
Recommended Video
ఆస్తుల విలువ ఎంత?
ఇక బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంత వుంటుంది అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా వరకు బ్రహ్మానందం కూడా డబ్బును బిజినెస్ లో పెట్టకుండా రియల్ ఎస్టేట్ వంటి వాటిలలో పెట్టుబడిగా పెట్టినట్లు టాక్. ఎక్కువగా ల్యాండ్స్ కొనే అలవాటు ఉందట. ఆ విధంగా ఆయన ఆస్తుల లెక్కలు 2017కి 350కోట్ల విలువ ఉంటుందట. అంటే ఇప్పుడు వాటి విలువ మరింత పెరిగిందనే చెప్పాలి.