మోహన్ బాబుకు భయపడే బ్రహ్మానందం ఆటోలో...!
హైదరాబాద్ : టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం అత్యంత ఖరీదైన కమెడియన్. రెమ్యూనరేషన్లో టాప్ హీరోల తర్వాత స్థానం బ్రహ్మీదే. తన ఒక్క రోజు కాల్షీట్‌కు రూ. 4 లక్షల వరకు వసూలు చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. అలాంటి బ్రహ్మానందం ఇటీవల విష్ణు హీరోగా రూపొందుతున్న 'దేనికైనా రెడీ' షూటింగుకు ఆటోలో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వాస్తవానికి బ్రహ్మానందం షూటింగ్ ఉందంటే...పికప్, డ్రాపింగ్ బాధ్యత నిర్మాతలదే. ఒక వేళ సొంత కారులో వస్తే దానికి అనదంగా నిర్మాతల నుంచి వసూలు చేస్తాడట. ఇక చిన్న దర్శకులు, చిన్న నిర్మాతలయితే బ్రహ్మీ చెప్పినట్లు వినక పోతే ఓ రేంజిలో వారిని టార్చర్ పెడతాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అయితే...'దేనికైనా రెడీ' చిత్రం విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా రివర్స్. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబు. మోహన్ బాబు వద్ద బ్రహ్మానందం పప్పులు ఉడక వని, ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు అంటే బ్రహ్మీకి భయమని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.
ఇటీవల మణికొండలో 'దేనికైనా రెడీ' సినిమా షూటింగుకు హాజరు కావాల్సి ఉండగా....డ్రైవర్ అందుబాటులో లేక పోవడంతో సమయం మించి పోక ముందే అక్కడి చేరుకోవాలని డిసైడ్ అయిన బ్రహ్మీ ఆటో రిక్షాలో షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. ఒక వేళ బ్రహ్మీ లేటుగా వస్తే....క్రమ శిక్షణ లేకుంటే అస్సలు సహించని మోహన్ బాబుతో షంటింగ్ ఉండేదని యూనిట్ సభ్యుల టాక్.
పరిశ్రమలో బిగ్ షాట్స్ అయిన మెగాస్టార్ ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీలకు చెందిన నిర్మాతలతో కలిసి పని చేసేప్పుడు కూడా బ్రహ్మా కాస్త అణకువగానే ఉంటాడని, మోహన్ బాబు అంటే మాత్రం ఈ కమెడియన్ మహా భయమని, ఎందుకంటే మోహన్ బాబు ముందు అలా చేస్తే పబ్లిక్ ఫంక్షన్లలో, మీడియాకు చెప్పడానికి కూడా ఆయన వెనకాడరని, అలా జరిగితే ఇప్పటి వరకు తనపై ఆరోపణలుగానే ఉన్నా కొన్ని విషయాలు నిజం అయి తన ఇమేజ్ బ్యాడ్ అవుతుందనేది బ్రహ్మానందం భయమట.
సినిమా వివరాల్లోకి వెళితే....విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న 'దేనికైనా రెడీ ' చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కెరీర్లో 'ఢీ' సినిమా తప్ప ఒక్క హిట్టు లేని విష్ణు ఈచిత్రం తన కెరీర్‌ను నిలబెడుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











