బ్రహ్మానందం వీడియోపై బ్రహ్మీ మీమ్స్.. క్రియేటివిటీ అదిరిపోలా!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లు వాడని వారు.. సోషల్ మీడియా అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. మన సమాచారం ఎవ్వరికీ తెలియదనే భ్రమలో మనమంతా ఉంటాం. కానీ సోషల్ మీడియా, ఈ యాప్స్, స్మార్ట్ ఫోన్‌ల వల్ల మన సమాచారానికి ఎప్పుడూ ముప్పు ఉన్నట్టే. పైగా ఈ మధ్య సైబర్ నేరాలు శ్రుతిమించిపోతోన్నాయి. బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతోంది. ఇలాంటి సైబర్ నేరాలపై ఎంత మంది అవగాహన కల్పించినా కూడా నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు.

అదే టార్గెట్..

అదే టార్గెట్..

ఎక్కువగా సైబర్ నేరాల్లో క్రెడిట్ కార్డ్, డెటిట్ కార్డ్, బ్యాంక్ ఖాతాలో డబ్బును ఖాళీ చేయడంపైనే దృష్టిపెడుతుంటారు. ఈ క్రమంలో మన ఓటీటీ, సీవీవీ, క్రెడిట్ డెబిట్ కార్డ్ వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కానీ నేరాలు ఆగడం లేదు.. మోసపోయే వారి సంఖ్య తగ్గడం లేదు.

 పోలీసులు అలా..

పోలీసులు అలా..

మామూలుగా తెలంగాణ పోలీసులు ఈ మధ్య జనాలకు ట్రెండిగా చెబితేనే అర్థం చేసుకుంటున్నారు.. వింటున్నారు.. వారికి ఎక్కుతుందని భావించినట్టున్నారు. అందుకే వారు కూడా మీమ్స్, ఫన్నీ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

 వెరైటీ ఆలోచన..

వెరైటీ ఆలోచన..

నిన్నమొన్నటి వరకూ బ్రహ్మానందం మీమ్స్‌తో సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసిన పోలీసులు.. తాజాగా హాస్య బ్రహ్మనే రంగంలోకి దింపారు. సైబర్ క్రైమ్ పోలీసులు బ్రహ్మానందంతో రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అలా అవగాహన..

అలా అవగాహన..

బ్యాంకు అధికారులు, బ్యాంకు కాల్ సెంటర్ సిబ్బంది, పోలీసులను ఈ వీడియోలో చూపించారు. ఓటీపీ, సీవీవీ వంటి నెంబర్లు మేం అడగం.. మేం అడగం అని వారితో సపరేట్ మ్యానరిజంతో చెప్పించారు. అయితే ఇలా ఎంత చెప్పినా వినడం లేదని నేరుగా బ్రహ్మానందాన్నే లైన్‌లోకి దింపారు. ఆయన వీడియోపై ఆయన ఫోటోలతో మీమ్స్ చేశారు.

 వీడియోలో మీమ్స్..

వీడియోలో మీమ్స్..

ఏమండీ.. మేమేం డిటెయిల్స్ అడగమని బ్యాంక్ వాళ్లు చెబుతుంటారు. ఒకవైపు పోలీసులు ఏ డిటెయిల్స్ చెప్పొద్దని అంటున్నారు. అయినా సరే ముక్కూ, మొహం తెలియని వాళ్లు ఏదైనా డిటెయిల్స్ అడగ్గానే టపటపా ఇచ్చేస్తుంటారు. కొంచెం ఆలోచించండి. తర్వాత మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో ఆలోచించండి. చివరికి బ్రహ్మానందం కూడా వచ్చి చెప్పాల్సి వస్తోంది అంటూ వీడియోను రూపొందించారు. అయితే బ్రహ్మానందం మాట్లాడుతున్నంత సేపు రకరకాల హావభావాలతో కూడిన బ్రహ్మీ మీమ్స్ హల్చల్ చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X