అక్కినేనిపై... బ్రహ్మీ బాంబు!
అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో....టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం కామెడీ బాంబులు పేల్చారు. 89 ఏళ్ల వయసులోనూ అక్కినేని ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాస్తవానికి ఈ వయసులో ఉన్న వాళ్లు ఇప్పటికే పళ్లు ఊడిపోయి, నడుము వంగి పోయి అవస్థ పడుతూ ఉంటారు అంటూ... పండు ముసలోడిలా నటించి నవ్వించారు.
బ్రహ్మానందం చెప్పిన దాంట్లోనూ వాస్తవం ఉంది. ఈ వయసు అంత స్ట్రాంగ్ గా ఉండటం అక్కినేని ప్రత్యేకత. తెలుగులు సినిమా చరిత్రలోనే కాదు, ప్రపంచ సినీ చరిత్రలోనూ 75 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సినీమాల్లో నటిస్తూ ఇప్పటికీ కొనసాగుతుండటం గొప్ప విషయం. సినీ వినీలాకాశంలో సుధీర్ఘ ప్రయాణం సాగించిన ఒకే ఒక్క లెజండ్.. ఏఎన్నార్.
ఇదే సమయంలో అక్కినేని స్పందిస్తూ.....100 ఏళ్లు జీవించమని కాకుండా బ్రతికినంత కాలం హాయిగా ఉండాలని చెబితే సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. 1924 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించిన అక్కినేని చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక (ఆడ) పాత్రలను ధరించాడు. 1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం.
అయితే పూర్తి స్థాయి కధా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆ చిత్రంలో రాముని పాత్రతో ప్రారంభించిన నటజీవితం బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో అప్రతిహతంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











