'రచ్చ'లో బ్రహ్మానందం,ఎమ్.ఎస్ నారాయణ పాత్రలు

By Srikanya

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ఈ రోజే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బ్రహ్మానందం రంగీలా ఫ్రమ్ అమెరికా అనే పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఎమ్.ఎస్.నారాయణ...రామ్ చరణ్ ని పెంచిన తండ్రిగా కనపిస్తాడు. అతని లివర్ కి సమస్య రావటంతోనే కథ మలుపుతుంది. అతన్ని బాగు చేయించాటనికి ఇరవై లక్షలు అవసరమైతే చరణ్ ఓ వ్యక్తితో పందెం కాసి హీరోయిన్ ని ప్రేమలో పడేసే పనిలో పడతాడు. అలా ఎమ్.ఎస్ క్యారెక్టర్ కథలో కీలకమై నిలుస్తుంది. ఇక సెకండాఫ్ లో దాదాపు కమిడెయిన్స్ అందరూ అంటే అలీ, వేణు మాధవ్,శ్రీనివాస రెడ్డి, తాగుబోతు రమేష్ తో సహా అందరూ ఉంటారు.

అలాగే ఈ చిత్రంలో చరణ్ మెడికో కాదు. ఓ బస్తీ మాస్ కుర్రాడు. ఇదో బస్తీ కుర్రాడికీ, డబ్బున్న అమ్మాయికీ మధ్య నడిచే కథ. అలాగని ప్రేమకథ కాదు... కానీ సినిమాలో ప్రేమ ఉంటుంది. కేవలం చరణ్‌ ఓ సన్నివేశంలో తెల్ల కోటు వేసుకొని మెడికో అవతారం ఎత్తుతారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ప్రధానమైన చిత్రమిది. కథలో మలుపులు సినిమాని కొత్తదారిలో నడిపిస్తాయి. మాస్‌ సినిమా అంటే ఇలా ఉంటుంది.. అని కొన్ని సమీకరణాలు ఉన్నాయి. వాటికి భిన్నంగా 'రచ్చ' ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్‌కి స్త్టెల్‌ తోడైతే 'రచ్చ'.


ఇక ప్రారంభంలో వచ్చే రచ్చ టైటిల్ సాంగ్,'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలోని 'వానావానా వెల్లువాయె' పాట రీమిక్స్ అదిరిపోతాయి. మణశర్మ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో రేంజికి తీసుకువెళ్తుంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా సినిమా మొత్తం నడుస్తుంది. తండ్రి కోరిక తీర్చటం కోసం విలన్స్ ని వెంటాడి పోరాడే సీన్స్ అదరకొడతాయి. ముఖ్యంగా ఛైనాలో తీసిన ఫైట్ సీన్ అద్బుతంగా కుదిరింది.

ఈ చిత్రంలో హైలెట్స్ ... రామ్ చరణ్ అగ్రిసెవ్,రగ్గడ్ క్యారెక్టరైజేషన్,తమన్నా ని ఇప్పటివరకూ చూపించిని మాస్ యాంగిల్లో ఎక్సప్లోర్ చేయటం. సినిమాలో ఉన్న ఇద్దరు విలన్స్ కి కథలో ప్రత్యేకత ఉండటం. మఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే 45 నిముషాల సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో, సెకండాఫ్ యాక్షన్ తో నడుస్తుంది. పాటల్లో తీస్ మార్ ఖాన్ రచ్చ ,వాన వాన వెల్లువాయే రెండూ టాప్ గా ఉండి అబిమానులను ఉర్రూతలూగిస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X