అసూయతోనే నాపై రూమర్స్: బ్రహ్మానందం
బ్రహ్మానందం నిర్మాతలను ఇబ్బందిపెడతారనీ, సమయానికి షూటింగ్‌కి రారనీ ఇండస్ట్రీలో అంటూంటారు.ఇదే విషయాన్ని బ్రహ్మానందం ఎదట పెట్టినప్పుడు ఆయన ఇదంతా తన ఎదుగదల చూసి అనూయతో ఎదుటివాళ్ళు చేసే ప్రచారంగా కొట్టిపారేసాడు.ఆయన మాటల్లోనే...ఒక మనిషి తన జీవితంలో డబ్బు, పేరు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. అదే తరహాలో అసూయను సంపాదించటం మాత్రం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది నేను టన్నుల కొద్దీ సంపాదించాను. ఆ అసూయే ఈ రూపంలో నాపై బురద జల్లుతోంది. ఎనిమిదేళ్లు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసినవాణ్ని. ఎవరైనా ఆలస్యంగా వస్తే ప్రశ్నించినవాణ్ని. సెట్‌లో రెండు గంటలు మాత్రమే ఉంటే యేడాదికి 32 సినిమాలు ఎలా చెయ్యగలుగుతాను? ఇలాంటి ప్రచారాల్ని నేను పెద్దగా పట్టించుకోను అన్నారు.
అలాగే నష్టపరిచాడు, టార్చర్ పెట్టాడు... అని ఏవేవో అంటున్నాడు జేడీ. ఒక టేక్‌ని పదిహేను టేక్‌లు తీస్తే ఎందుకు నష్టం జరగదు? షూటింగ్‌లో కథ చెప్పలేక అతనోసారి నవ్వుతాడు. నేను నటిస్తున్నప్పుడు పక్కనున్నవాళ్లు గట్టిగా నవ్వుతారు, నన్ను నవ్విస్తారు. ఇలా ఫిల్మ్ ఎక్కువగా ఖర్చయింది. దానికి నాదా బాధ్యత? అతనికి అన్నీ గురువు రామ్‌గోపాల్‌వర్మ బుద్ధులే వచ్చాయి. ప్రతి విషయాన్నీ ప్రచారంకోసం వాడుకొంటాడు అన్నారు.ఇక తన తాజా చిత్రం మనీ మనీ మోర్ మనీలో తన పాత్ర గురించి చెపుతూ...ఖాన్‌దాదాలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. అదే వెటకారం, అదే అమాయకత్వం. వయసు మీదపడింది కదాని ఖాళీగా కూర్చోడు. చిన్న చిన్న దందాలు నడుపుతూనే ఉంటాడు. భార్య, కొడుకు, కూతురుతోపాటు ఒక అత్తతో కలిసి గుట్టుగా కాలం వెళ్లదీస్తుంటాడు. ఇంతలో అతని ఇంట్లోకి నలుగురు కిడ్నాపర్లు ప్రవేశిస్తారు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది అన్నారాయన.


Click it and Unblock the Notifications











