విష్ణు 'వస్తాడు నా రాజు' సెకెండాఫ్ లో హైలెట్ అదేనా?
విష్ణు, తాప్సీ కాంబినేషన్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన "వస్తాడు నా రాజు" చిత్రం సెకెండాఫ్ లో బ్రహ్మానందం కామెడీ హైలెట్ కానుందని తెలుస్తోంది. ఇంటర్వెల్ తర్వాత బ్రహ్మానందం ఇంట్లోకి తాప్సీ వస్తుంది. అక్కడ నుంచి విష్ణు, బ్రహ్మానందం ల మధ్య గేమ్ మొదలవుతుంది. ఇది హిలేరియస్ గా ఉంటుందని చెప్తున్నారు. విష్ణు కెరీర్ లో హిట్టుగా నిలిచిన ఢీ చిత్రంలో ఆచారి, విష్ణు పాత్రలా ఈ సీన్స్ హైలెట్ అవుతాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని విష్ణు తన స్వంత బ్యానర్ 24 ప్రేమ్స్ పై నిర్మిస్తున్నారు. ఇక ఆ మధ్య 'వస్తాడు నా రాజు' చిత్రం ట్రైలర్స్ లో ఒక దానికి కి సెన్సార్ నో చెప్పింది. దాంతో విష్ణు సెన్సార్ వారిపై మండిపడ్డాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... " 'సడేమియా...' పాటలో తాప్సి గాగ్రా చోళీ వేసుకొని ఉంటుంది. నాభి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దృశ్యాన్ని తొలగించాలని సెన్సారు వారు పట్టు పడుతున్నారు. హీరోయిన్ బొడ్డు కనిపించినంత మాత్రాన కత్తెర వేయడం పద్దతి కాదు" అన్నారు. కాబట్టి సినిమాలో కామిడీకి బ్రహ్మానందం, గ్లామర్ కి తాప్సీ బాగానే ఉపయోగపడేటట్లు ఉన్నారు. ఈ చిత్రంలో విష్ణు స్పోర్ట్స్ మెన్ గా కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











