twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందంకు ‘గురుశ్రీ’ పురస్కారం

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ సినీయన్ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహానందం 'గురుశ్రీ' పురస్కారం అందుకున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

    ఈ సందర్భంగా శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ 'హాస్యబ్రహ్మ'కు స్వర్ణకంకణ ధారణ చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఆదిపరాశక్తి కుమారులే త్రిమూర్తులని పేర్కొన్నారు. వీరిలో సృష్టించేవాడు బ్రహ్మ అయితే, నడిపించే వాడు విష్ణువని, ఇక తీసుకెళ్లేవాడు శివుడని, ఈ ముగ్గురినీ కలిపి దేవుడు అంటారని అభివర్ణించారు.

    Brahmanandam facilitated with Guru Shri award

    వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మ్ పద్మ పురస్కారాన్నిసైతం అందుకున్నారు.

    నటించిన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం స్టైల్. బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు.

    బ్రహ్మానందాని బాగా గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర 'అహనా పెళ్లంట' చిత్రంలో అరగుండు పాత్ర. ఆ తర్వాత ఆయన ఖాన్ దాదా, కత్తి రాందాసు, గచ్చిబౌలి దివాకరం లాంటి పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు.

    English summary
    Brahmanandam facilitated with Guru Shri award. Brahmanandam Kanneganti is an Indian film actor and comedian, known for his works predominantly in Telugu cinema. He currently holds the Guinness World Record for the most screen credits for a living actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X