Karnataka Results: బ్రహ్మానందం ప్రచారం చేసిన అభ్యర్థికి షాకింగ్ ఓట్లు.. వర్కౌట్ కానీ ఆ సెంటిమెంట్!
తెలుగు అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఆయనకు ఉన్న పేరు ఎవరు భర్తీ చేయలేరు. తనదైన హాస్యంతో యావత్ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇటీవల కాలంలో రంగమార్తాండ వంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు కూడా చేస్తూ అందులోనూ మెప్పు పొందారు. సినిమాలే కాకుండా ఈ మధ్య రాజకీయంలోకి కూడా పరోక్షంగా అడుగుపెట్టారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలోకి బ్రహ్మానందం ఎవరి కోసమైతే సపోర్ట్ గా నిలిచారో వారికి ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..
మీమ్స్ తో : జఫ్పా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు, నా పర్ఫామెన్స్ మీకు నచ్చినట్లయితే ఎస్సెమ్మ్మెస్ చేయండి, ఖాన్స్ తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్, దొరికాడా ఏసేయ్యండి వంటి డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు హాస్య నటులు బ్రహ్మానందం. వేల చిత్రాల్లో నటించి భవిష్యత్తులో చెరగని హాస్యాన్ని పండించారు. సినిమాల తర్వాత మొన్నటి వరకు చాలా గ్యాప్ తీసుకున్న ఆయన హాస్యం సోషల్ మీడియాలో మీమ్స్ తో నిత్యం ఎంటర్టైన్ చేసింది.

పరోక్షంగా ఎన్నికల్లో : ఇటీవల వాంటెడ్ పండుగాడ్, పంచతంత్ర వంటి చిత్రాల్లో దర్శనం ఇచ్చిన బ్రహ్మానందం.. రంగమార్తాండ మూవీలో మాత్రం సీరియస్ పాత్ర చేసి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. కమెడియన్ గానే కాకుండా నటుడిగా కూడా మరో మెట్టు ఎక్కి తాను ఎలాంటి పాత్రైన చేయగలనని నిరూపించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన పరోక్షంగా కర్ణాటక ఎన్నికల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఏపీకి ఆనుకుని : తన స్నేహితుడు బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ రావు తరపున నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం చేశారు. ఏపీకి ఆనుకుని ఉన్న చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికం. అందుకే బీజేపీ అభ్యర్థి సుధాకర్ కు మద్దతుగా క్యాంపేయిన్ లో పాల్గొన్నారు. తనదైన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఎన్ని ఓట్లు వచ్చాయంటే : అయితే బ్రహ్మానదం మద్దతుగా ప్రచారం చేసిన సుధాకర్ ఊహించని విధంగా ఓడిపోయారు. ఆయనపై 11, 130 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ ఘన విజయం సాధించారు. ఈశ్వర్ కు 69 వేల 8 ఓట్లు రాగా.. సుధాకర్ కు 57 వేల 878 ఓట్లు పడ్డాయి. ఇక జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ 13, 300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

గతంలో మాత్రం : ఇదిలా ఉంటే గత ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేశారు. అప్పుడు సుధాకర్ మంచి మెజార్టీతో గెలుపొందారు. ఈసారి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేద్దామన్న ఉద్దేశంతో తన ఫ్రెండ్ బ్రహ్మానందంతో 4 రోజులపాటు ప్రచారం చేయించారు సుధాకర్. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అనుకోని విధంగా ఓడిపోయారు.


Click it and Unblock the Notifications











