'గబ్బర్ సింగ్' గెటప్ లో ప్యారీడీ చేస్తూ బ్రహ్మానందం

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం స్ఫూఫ్ త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. బ్రహ్మానందం ..పూర్తిగా పనన్ ని అనుకరిస్తూ ఈ స్ఫూప్ చేసారు. ఈ పేరడి..బషీద్ తాజా చిత్రం ఫైర్ లో ఉండబోతోందని సమాచారం. ఇదివరకు 'అల్లరే అల్లరి', 'రామ్‌దేవ్' వంటి చిత్రాల్ని నిర్మించిన ఎస్‌కె. బషీద్ తాజాగా ఎస్.బి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఫైర్'.

ఈ సినిమా గురించి బషీద్ మాట్లాడుతూ "అమెరికా, హాంకాంగ్, మలేషియా, బ్యాంకాక్, కేరళతో పాటు హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపాం. నాలుగు పాటల్ని విదేశాల్లోని అందమైన లొకేషన్‌లలో తీశాం. ఓ పాటని రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీసెట్ వేసి రేఖ, డాన్సర్లపై చిత్రీకరించాం. ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. ఇందులో హీరోయిన్ల పాత్రలు చాలా గ్లామరస్‌గా ఉండి, యువతను విశేషంగా ఆకర్షిస్తాయి. ఎం.ఎం. శ్రీలేఖ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ నెలలో పాటల్నీ, సెప్టెంబర్‌లో సినిమానీ విడుదల చేయబోతున్నాం. మరో వారం రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. మా సంస్థలో వచ్చిన 'అల్లరే అల్లరి'ని మించి ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

నమిత, 'ప్రేమిస్తే' సంధ్య, భానుశ్రీ మెహ్రా, రేఖ, మౌనిక, రిషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్, తెలంగాణ శకుంతల, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, నల్ల వేణు, వినోద్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.ఎస్. సెల్వరాజ్, మధు ఎ. నాయుడు, కళ: బాబా, ఫైట్స్: దళపతి దినేశ్, డిఫరెంట్ డానీ, సమర్పణ: మాస్టర్ ఎస్‌కె. అబ్దుల్లా, నిర్మాత: ఎస్‌కె. కరీమున్నీసా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌కె. బషీద్.

ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ కూడా తన సుడిగాడు చిత్రంలో గబ్బర్ సింగ్ ని పేరడీ చేస్తున్నారు. అందులోని నాకు కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది డైలాగుని ఫన్ చేసి నవ్వించనున్నారు.ఇప్పుడు బ్ర్హహ్మానందం ఇలా ఈ గెటప్ తో నవ్వించబోతున్నారు. మొత్తానికి పవన్ సూపర్ హిట్ ఈ రకంగా కూడా ప్రేక్షకులను అలరించనుంది. ఇక గబ్బర్ సింగ్ లో కూడా అనేక సూపర్ హిట్ పాటల అంత్యాక్షరితో నవ్వించారు పవన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X