బ్రహ్మికి 20లక్షల SMSలు
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో ఐ న్యూస్ వారు టెన్ లాక్ షో పేరుతో ఓ గేమ్ షో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. నేను రెఢీ మీరు రెఢీయా అనే ట్యాగ్ లైన్ తో సిద్దమవుతున్నఈ బ్రహ్మి టెన్ లాక్ షో కి ఎస్.ఎం.ఎస్ ల ద్వారా పాల్గొనే వారి ఎంపిక ప్రారంభమైంది. ఇప్పటికే ఈ షోకి రెండు లక్షల ఎస్.ఎం.ఎస్ లు వచ్చినట్లు ఐ న్యూస్ సీఇఓ రాజశేఖర్ చెప్తున్నారు.మరి కొద్ది రోజుల్లో ఆ ఎస్.ఎమ్.ఎస్ లు ఇరవై లక్షలు దాకా చేరవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇలా ఓ గేమ్ షో కు ఇంత పెద్ద మొత్తంలో ఎస్.ఎం.ఎస్ లు రావటం టీవీల చరిత్రలో ఓ రికార్డే నంటున్నారు. గతంలో ధర్మవరపు సుబ్రమణ్యం ఈ తరహా కార్యక్రమాన్ని చేసారు..కానీ ఊహించినంతగా అది క్లిక్ కాలేదు.
ఇక ఈ గేమ్ షో 'కౌన్ బనేగే కరోడ్ పతి' మాదిరిగా జరుగుతుంది. 15 ప్రశ్నలకు ప్రేక్షకులు జవాబిచ్చి 10 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ఈ షో లో ఉంటుంది. మొదటి ప్రశ్నకు వెయ్య రూపాయలుతో ఈ షో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి 15 ప్రశ్నలకు జవాబు చెపితే 10 లక్షల రూపాయలు విజేతల సొంతమవుతాయి. మొదటి రౌండ్ కోసం ఎస్.ఎం.ఎస్ ల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బ్రహ్మానందంతో పోరుకు హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది. ఈ షోకి కొంత మంది పాపులర్ స్టార్స్ ని కూడా ఇన్వైట్ చేస్తారు. వారు గెస్ట్ కాంపిటేటర్స్ గా రానున్నారు. బ్రహ్మానందంకు టీవీ తెరపై ఇదే మొదటి షో కావటంతో ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నారని టీవీ వర్గాలు చెపుతున్నాయి.


Click it and Unblock the Notifications











