బ్రహ్మానందం ‘జెఫ్పా’ బాలీవుడ్లో...

యాక్టర్, డైరెక్టర్ వెన్నెల కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఈచిత్రాన్ని టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 'వెన్నెల 1/2' చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన వెన్నెల కిషోర్ 'జెఫ్పా' చిత్రానికి దర్శకత్వంతో పాటు రైటర్‌గా పని చేస్తున్నారు.
అయితే బాలీవుడ్ వెర్షన్‌లో లీడింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే బాధ్యతలు మాత్రమే చూసుకుంటారు. వెన్నెల కిషోర్ ఫ్రెండ్, కొరియోగ్రాఫర్ సాగర్ దాస్ బాలీవుడ్ వెర్షన్ 'జెఫ్పా'కు దర్శకత్వం వహించనున్నారు. సాగర్ దాస్ షారుఖ్ యొక్క 'చక్ దే ఇండియా', మణిరత్నం యొక్క 'రావన్' లాంటి హై బడ్జెట్ చిత్రాల్లోని ఐటం నెంబర్లకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











