నవ్వుకోండి...!‘జేజమ్మ వాకిట్లో జెఫ్పా చెట్టు’
హైదరాబాద్ : టాలీవుడ్ నవ్వుల డాన్ బహ్మానందం ఫేసు రకరకాల మార్ఫింగులతో నెట్‌లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ పెద్ద హీరో కొత్త సినిమా వచ్చినా...ఆ సినిమా పోస్టర్‌కి బ్రహ్మీ ఫోటోను మార్ఫింగ్ చేసి నెటిజన్లకు వినోదం పంచుతున్నారు బ్రహ్మీ ఫ్యాన్స్. అమెరికా అధ్యక్షుడి దగ్గరి నుంచి అన్నా హజారే దాకా ఎవరినీ వదిలి పెట్టడం లేదు ఆయన అభిమానులు.
తాజాగా వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఫోస్టర్ వియషయంలోనూ ఈ తంతు రిపీట్ అయింది. 'జేజమ్మ వాకిట్లో జెఫ్పా చెట్టు' అంటూ బ్రహ్మీ కామెడీ ఫేసు తగిలించి తెగ నవ్విస్తున్నారు. ఇప్పుడు ఇది ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.
అయితే ఇలాంటి చర్యలపై బ్రహ్మానందం కొన్ని నెలల క్రితం స్పందించారు. 'ఫేస్ బుక్ మెంబర్స్‌కి నా అభ్యర్థన...మీరు నామీద ఎన్ని జోకులయినా వేసుకోండి...కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోండి...నాకేం బాధ లేదు...ఎందుకంటే నేను పుట్టిందే మిమ్మల్ని నవ్వించడానికి...కానీ నా పేరు పెట్టుకుని ఇతరులను మాత్రం దయచేసి అవమానించకండి...అది నన్ను తీవ్రంగా బాధిస్తోంది...నేను ఎప్పుడూ అలా కోరుకోను...నా అభ్యర్థనను పెద్ద మనసుతో ఆలకిస్తారని భావిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు.
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రాబోతున్న 'జెఫ్పా చిత్రం వివరాల్లోకి వెళితే...విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం కథ పూర్తిగా జైల్లో జరగనుంది. కిరణ్ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై రమేష్‌వర్మ నిర్మిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జఫ్ఫాగా బ్రహ్మానందం నటన ఆద్యంతం అలరిస్తుంది. ఈచిత్రం 2013లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











