twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందంలో ఈ టాలెంట్ కూడా ఉందండోయ్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బ్రహ్మానందం ఇప్పటి వరకు నవ్వించడం, ఏడిపించడం, విలనిజం ప్రదర్శించడం లాంటి నటనాపరమైన టాలెంటు మాత్రమే చూసాం. ఆయనలో కేవలం ఈ కళ మాత్రమే కాదు...శిల్ప కళ కూడా ఉంది. బంక మట్టితో ఆయన రూపొందిన ఓ శిల్పం ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆయన చెక్కిన శిల్పం రవీంద్రనాథ్ ఠాగూర్ అని తెలుస్తోంది.

    బ్రహ్మానందం గురించిన వివరాల్లోకి వెళితే...తెలుగు సినీ శ్రమలో కామెడీ డాన్‌ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం పేరు. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే.

     Brahmanandam new talent Sculpture

    ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం వరకు 998లకు పైగా సినిమాల్లో నటించారు. బ్రహ్మానందం త్వరలో 1000 సినిమాలు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలు, దేవుడి దయ వల్లే ఇది సాధ్యమైంది అంటున్నారు బ్రహ్మానందం.

    నటించిన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం స్టైల్. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

    English summary
    Check out Brahmanandam new talent Sculpture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X