Just In
- 12 min ago
పునర్నవితో అందుకే దూరం.. అన్ని మింగాల్సి వచ్చింది: అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాహుల్
- 1 hr ago
నా బెడ్రూంలో పవన్ కల్యాణ్.. మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది: బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్
- 1 hr ago
సుడిగాలి సుధీర్ తర్వాత అభిజీత్: బిగ్ బాస్ విన్నర్ ఖాతాలో మరో రికార్డు.. దేశ వ్యాప్తంగా హైలైట్!
- 12 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
Don't Miss!
- News
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
- Sports
విరాట్ కోహ్లీనే నా కెప్టెన్.. నేను అతని డిప్యూటీని మాత్రమే: అజింక్యా రహానే
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రహ్మానందం స్పెషల్ గిప్ట్.. 45 రోజుల కఠోర శ్రమ అంటూ బన్నీ ఎమోషనల్
తెరపై కనిపించే, సినిమాలో పోషించే పాత్రలకు నిజ జీవితానికి ఎంతో తేడా ఉంటుంది. తెరపై బ్రహ్మానందం ఎంత కామెడీ చేస్తాడో నిజ జీవితంలో అంతకు మించి సీరియస్‌గా, హుందాగా ఉంటాడు. ఈ లాక్డౌన్ వల్ల బ్రహ్మానందంలోని మరో టాలెంట్ బయటకు వచ్చింది. లాక్డౌన్ సమయంలో బ్రహ్మానందం కొన్ని విషయాల్లో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. తాజాగా మరోసారి బ్రహ్మానందం అందరినీ అబ్బుర పరిచాడు.

సోషల్ మీడియాలో వైరల్..
లాక్డౌన్ సమయంలో బ్రహ్మానందం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. సోనూ సూద్ దాన ధర్మాలపై బ్రహ్మానందం సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నాకు ఇలా ఫోటోలు దిగాలని, చేసినవన్నీ చెప్పుకోవాలని తెలీదు అంటూ కామెంట్ చేశాడు. గుప్త దానం గురించి బ్రహ్మానందం చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. అంతే కాకుండా తన ఆర్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశాడు.

దేవుళ్ల బొమ్మతో..
దేవుళ్ల బొమ్మలను గీస్తూ బ్రహ్మానందం అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ మధ్య శ్రీరాముడు, ఆంజనేయుడు బొమ్మలను గీసి అబ్బురపరిచాడు. ఆగస్ట్ 15న భారతదేశం బొమ్మను గీసి దేశ భక్తిని చాటాడు. ఇలా ప్రతీ సారి ఏదో ఒక సందర్భంలో తనలోని బ్రహ్మ సృష్టిని బయటకు తీస్తున్నాడు. బాపు గీసన బొమ్మలా ఎంతో అందంగా ఆర్ట్ వేస్తున్నాడు.

తాజాగా ఇలా..
బ్రహ్మానందం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని తన చేతులతో గీశాడు. పూజారి ఎంతో నిష్టగా పూజలు చేస్తున్నట్టుగా ఏడు కొండల స్వామిని బ్రహ్మానందం గీశాడు. కుంచె పట్టని బ్రహ్మానందం.. ఇలా పెన్సిల్‌తో స్కెచ్ వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

బన్నీకి గిఫ్ట్..
బ్రహ్మానందం తాను గీసిన వెంకటేశ్వరస్వామి బొమ్మను అల్లు అర్జున్‌కు బహుమతిగా పంపాడు. దాన్ని చూసిన బన్నీ ఎమోషనల్ అయ్యాడు. నాకెంతో ఇష్టమైన బ్రహ్మానందం గారి నుంచి ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ వచ్చింది.. నాకు వచ్చిన గిప్ట్‌లన్నింటిలో ఇదే గొప్పది.. 45 రోజలు కఠిన శ్రమ.. చేతితో వేసిన ఈ పెన్సిల్ స్కెచ్ ఎంతో బాగుంది ధన్యవాదాలని బన్నీ ట్వీట్ చేశాడు.