For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం హీరోగా కొత్త చిత్రం ‘జిలేబి’

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొంది,సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం నాయక్. ఈ చిత్రం బ్రహ్మానందం పాత్ర పేరు జిలేబి. ఈ చిత్రం విజయంలో ఈ పాత్ర మేజర్ పాత్ర పోషించిందనటంలో అతిశయోక్తిలేదు. దాంతో ఇప్పుడు బ్రహ్మానందం జిలేబిగా బాగా పాపులర్ అయ్యారు. దాంతో ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కొత్త నిర్మాత 'జిలేబి' టైటిల్ ని రిజిస్టర్ చేసారు. బ్రహ్మానందం హీరోగా ఈ 'జిలేబి' చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే బ్రహ్మానందం జఫ్పా టైటిల్ తో ఓ చిత్రం చేసారు.

    హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ దర్శకత్వంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'జఫ్ఫా'. విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం పూర్తి రైట్స్ ని రవితేజ 'వీర'దర్శకుడు రమేష్ వర్మ తీసుకుని నిర్మాత గా మారారని సమాచారం. ఆయనే ఇప్పుడు ఈ చిత్రం బిజినెస్ చూస్తున్నారు. తాజాగా సాయి మనాలి ఎంటర్టైన్మెంట్స్ వారికి ఈ చిత్రం ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు అమ్మారు. అలాగే బ్లూ స్కై సినిమా వారికి మిగిలిన ఓవర్ సీస్ రైట్స్ ని ఇచ్చారు.

    కథ పూర్తిగా జైల్లో జరగనుంది. కిరణ్‌ స్టూడియోస్‌ ప్రై.లి. పతాకంపై రమేష్‌వర్మ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ...''జైలు నేపథ్యంలో సాగే కథ ఇది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జఫ్ఫాగా బ్రహ్మానందం నటన ఆద్యంతం అలరిస్తుంది. నాలుగు పాటలున్నాయి. ఆ పాటల్లోనూ కావల్సినంత వినోదాన్ని మేళవించాం. సునీల్‌ కాశ్యప్‌ మంచి బాణీలను అందించారు'' అని తెలిపారు.

    ఇక ఈ చిత్రం ట్రైలర్ ఆ మధ్యన విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం.. సంకెళ్లతో ఓ పోలీస్ అధికారి పట్టుకుని ఉంటాడు. అతన్ని నీ పేరేంటి అని అడుగుతాడు. ఎదురుగా ఉన్న బ్రహ్మానందం చెప్పడు. ఇరిటేషన్ తో ఆ పోలీస్ అధికారినీ పేరేంటిరా జప్పా అని అరుస్తాడు. అప్పుడు బ్రహ్మానదం..నా పేరు అదే అని కూల్ గా చెప్పుతాడు. ఆ తర్వాత బ్రహ్మానందం మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు, కిడ్నాప్ చేయలేదు అయినా మోస్ట్ వాంటెడ్ అని వస్తుంది. త్వరలోనే దొరుకుతాడు అనే టైటిల్ కార్డుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.

    English summary
    A new producer cum director has registered the title of “Jilebi” for a film in which Brahmi will be acting as hero. Apparently, “Jilebi” is the name of Brahmi’s character in ‘Naayak’ which has spread huge laughs in theatres. So, after “Jaffa” brahmi would be called as “Jilebi”. Wait some more time for full details of “Jilebi”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X