బ్రహ్మానందం రెమ్యూనరేషన్లో... దారుణంగా కోత, కారణాలు ఇవే..!

By Bojja Kumar

Recommended Video

Brahmanandam Remuneration Cut Down To Very Low

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం... కొన్ని దశబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో నవ్వులు పూయిస్తూ తన హవా కొనసాగించారు. ఒకానొక సమయంలో ఆయన లేకుండా ఏ స్టార్ హీరో సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. కొన్ని సినిమాలైతే ఆయన కామెడీ వల్లనే హిట్టయ్యేవి. మోస్ట్ డిమాండింగ్ కమెడియన్ కావడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకునేవారు. ఒక్కో కాల్ షీటుకు రూ. 2 లక్షల నుండి రూ. 6 లక్షలు వరకు చార్జ్ చేసేవారు. అయితే పరిస్థితి ఒకప్పటిలా లేదని, ఇపుడు డిమాండ్ బాగా తగ్గిందని, రెమ్యూనరేషన్ కూడా భారీగా తగ్గించారని టాక్.

న్యూ జనరేషన్ హవా

న్యూ జనరేషన్ హవా

అయితే గడిచిన నాలుగేళ్లుగా బ్రహ్మానందం నటించే సినిమాల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. మరో వైపు న్యూ జనరేషన్ కమెడియన్ల హవా సాగుతోంది. దీంతో బ్రహ్మానందం డిమాండ్ దారుణంగా పడిపోయిందని అంటున్నారు.

ఈయన తగ్గడానికి కారణం వారే

ఈయన తగ్గడానికి కారణం వారే

బ్రహ్మానందం డిమాండ్ తగ్గడానికి కొత్త జనరేషన్ హవాతో పాటు.... ఆయనకు వచ్చే పాత్రలు రోటీన్ అవ్వడం కూడా ఓ కారణం. దర్శకులు, రచయితలు బ్రహ్మాని కొత్తగా ప్రజంట్ చేయడంలో విఫలం అవుతున్నారు. బ్రహ్మానందం జోరు తగ్గడానికి ముఖ్యకారణం దర్శకులు, రచయితలు ఆయనపై సరిగా ఫోకస్ పెట్టక పోవడమే అని చెప్పకతప్పదు.

భారీగా తగ్గిన రెమ్యూనరేషన్

భారీగా తగ్గిన రెమ్యూనరేషన్

డిమాండ్ బాగా తగ్గడంతో తన రెమ్యూనరేషన్ కూడా బాగా తగ్గించేశారట ఈ హాస్య చక్రవర్తి. ఇప్పుడు ఒక్కో కాల్ షీట్‌‌కు 50 వేలు చార్జ్ చేస్తున్నారట. ఒకప్పటితో పోలిస్తే అవకాశాలు కాస్త తగ్గాయని ఇండస్ట్రీ టాక్. వయసు పైబడటంతో బ్రహ్మానందం కూడా తనకు నచ్చినవి మాత్రమే కమిట్ అవుతున్నారట. అందుకే బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం చాలా తగ్గిపోయింది.

వెయ్యి చిత్రాల హాస్య బ్రహ్మా

వెయ్యి చిత్రాల హాస్య బ్రహ్మా

ఇప్పుడు ఆయన చేసే సినిమాల సంఖ్య తగ్గి ఉండొచ్చు, ఆయన రెమ్యూనరేషన్ తగ్గిండొచ్చు.... కానీ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న ఘనత ఆయనది. . తెలుగు ప్రజలను తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన గొప్ప నటుడు. వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్న హాస్య బ్రహ్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X