»   » బ్రహ్మానందం... యోగా (ఫోటోస్)

బ్రహ్మానందం... యోగా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు వేసే కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో స్వయంగా పాలు పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మానందం కూడా తన రూమ్ లో యోగాసనాలు వేయడం ద్వారా తాను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. వెండితెరపై నవ్వులు పూయించే బ్రహ్మానందం ఈ యోగా ఫోజులో కూడా నవ్వు తెప్పిస్తున్నాడని అంటున్నారు అభిమానులు.

Brahmanandam participated in International day of Yoga
English summary
Brahmanandam participated in International day of Yoga. Brahmanandam performing Yoga in his unique posture. PM Narendra Modi, who has initiated the concept of Yoga to spread across the World has been successful motivating the people all over the world.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu