twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం ఒక్క పైసా అవసరం లేదన్నా ఆయన్ని తీసుకోలేకపోయాం... ఫొటోలతోనే

    బ్రహ్మానందం ఒక్క పైసా అవసరం లేదన్నా ఆయన్ని తీసుకోలేకపోయాం... ఫొటోలతోనే

    |

    ఇటీవల కాలంలో టాలీవుడ్ పరిశ్రమలో బ్రాహ్మి హవా తగ్గిపోయింది. కొంతకాలంగా సూపర్ హిట్ అవుతున్న ఏ సినిమాలో కూడా బ్రాహ్మి లేకపోవడంతో...బ్రహ్మానందం లేకపోయినా సినిమాలు సూపర్ హిట్ అవుతాయనే నిశ్చయానికి దర్శకనిర్మాతలు వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో గతవారం వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో బ్రహ్మానందం ని పరోక్షంగా వాడుకున్నారు ఆ చిత్ర నిర్మాతలు.

    ఈసినిమాలో నటించిన ఒక పాత్ర సందర్భానుసారంగా తన ఫీలింగ్స్ ఏమిటో చెప్పడానికి బ్రహ్మానందం హవభావాల్ని వాడుకుంటుంది. బ్రహ్మి ఎక్స్ ప్రెషన్లకు ఇమోజీలు యాడ్ చేసి తన మొబైల్ ద్వారా వేరే వాళ్లకు మెసేజ్ లు పంపుతుంది. దీనితో బ్రహ్మి తాను కనిపించకుండానే ఇలా వెరైటీగా ఈమూవీలో వినోదం పంచాడు.

    అయితే బ్రహ్మీని ఇలా వాడుకోవడానికి మొదట్లో ఈసినిమా దర్శకుడు చాల భయపడ్డాడట. అయితే ఈసినిమా హీరో శ్రీనివాసరెడ్డి చొరవతో బ్రహ్మానందం తన బొమ్మను ఇలా వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు సరికదా కనీసం తనకు థ్యాంక్స్ కార్డు కూడా వేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడట.

    ఈవిషయాలన్నీ ఈమధ్య ఈ మూవీ హీరో శ్రీనివాసరెడ్డి తెలియచేసాడు. తాను ఈసినిమా నిర్మాణ సమయంలో బ్రహ్మానందంకు ఫోన్ చేసి ఈసినిమా దర్శకుడి ఆలోచనలను వివరించినప్పుడు 'నా బొమ్మ వాడుకోవడం ఎందుకురా నేనే చేస్తాను ఫ్రీగా నీకోసం' అని శ్రీనివాసరెడ్డితో అన్నాడట బ్రహ్మీ. అయితే 'వద్దులెండి గురువుగారు.. మిమ్మల్ని పెట్టుకునే స్థాయి మాకు లేదు' అంటూ తన పనిని సులువుగా ముగించుకున్న విషయాన్నీ బయట పెట్టాడు శ్రీనివాసరెడ్డి.

    Brahmanandam Photo Is Enough Dude

    పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పటికీ తన సినిమాను ఆదరించడం ఆనందంగా ఉందని 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా హీరో శ్రీనివాసరెడ్డి అన్నారు. సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా యూనిట్‌ సభ్యులు చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఆనంద్‌ థియేటర్‌కు శనివారం వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేక ఆగిపోయాయన్నారు. ఇటువంటి సమయంలో కూడా తన చిత్రాన్ని ఆదరించిన గోదావరి జిల్లాల ప్రేక్షకుల అభిమానాన్ని మరువలేనన్నారు.

    చిత్రంలో తన నటన, హాస్యం ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకొన్నారు. సినిమాలో హిట్‌ డైలాగులతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. దర్శకుడు కనుమూరి శివరాజ్‌ మాట్లాడుతూ తాను రాజోలు గ్రామానికి చెందినవాడినన్నారు. ఈ చిత్రాన్ని ఉభయ గోదావరి జిల్లాలోనే చిత్రీకరించామని చెప్పారు. మహిళలను ఆకట్టుకొనే విధంగా చిత్రాన్ని నిర్మించామన్నారు. గాయని స్పందన 'ఓ రంగుల చిలుకా' పాటను ఆలపించి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. విజయ యాత్రలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవిచంద్ర, నటులు రవివర్మ, గాయకుడు కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.,

    English summary
    Director Shiv Raj Kanumuri has also extracted comedy by just using Brahmanandam’s photo in the movie. Hero Srinivas Reddy is said to have sought permission from the Star comedian to use his photo in the film. “Thanks to Brahmanandam Annayya, he was even ready to act free for me. But the shooting was going on in Bheemli so we don’t want to trouble him,” said Srinivas Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X