బ్రహ్మానందం ప్రయోగం 'ఫొటో స్పీక్స్'
త్వరలో కమిడియెన్ 'ఫొటో స్పీక్స్' అనే ప్రయోగంతో ముందుకు రానున్నారు. ఈ విషయం గురించి ఆయన చెపుతూ.."చిన్నతనం నుంచి సినీ పరిశ్రమ వరకు పలు ఫొటోలు సేకరించాను. వాటికి కొన్ని కవితాపరమైన వ్యాఖ్యలు జోడించి ఒక జీవితకథ మాదిరి తయారు చేస్తాను."అన్నారు.అందునిమిత్తం ఆయన ఇప్పటివరకు ఆయన సుమారు 250 ఫొటోలు సేకరించారు. 'ఫొటో స్పీక్స్' (ఫొటో మాట్లాడుతుంది) పేరిట ఈ ఏడాది చివరకు ఒక ఆల్బమ్ తయారు చేయాలని ఆయన ఉద్దేశంగా చెప్తున్నారు.ఇక సినిమా షూటింగ్‌లు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం గురించి పనిచేస్తున్నానని చెప్పారు. అలాగే నాకు భయానకమైన జ్ఞాపకశక్తి ఉంది. దీనిని ఫొటోగ్రాఫిక్ జ్ఞాపక శక్తి అని చెప్పవచ్చు. నేను చదువుకునే రోజుల నుంచి, 30 సంవత్సరాల క్రితం చిరంజీవితో మాట్లాడిన సంగతులు కూడా గుర్తున్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











