twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వుకోండి: బ్రహ్మానందం కబడ్డీ ఆడుతూ...(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మేము సైతం పోగ్రాంలో భాగంగా కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో బ్లాక్‌ టైగర్స్‌ (మంచు విష్ణు), రెడ్‌ పాంథర్స్‌ (మంచు మనోజ్‌) జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెడ్‌ పాంథర్స్‌ 24 - 22 పాయింట్ల తేడాతో గెలిచింది. ఈ ఆటలో బ్రహ్మానందం హైలెట్ గా నిలిచారు. ఆయన కూత పెడుతూ వెళ్తూంటే నవ్వులతో నిండిపోయింది. మీరూ ఆ వీడియోని చూసి ఎంజాయ్ చెయ్యండి.

    మ్యాచ్‌కి మోహన్‌బాబు రిఫరీగా వ్యవహరించారు. వెంకటేష్‌ మధ్యలో మైక్‌ పట్టుకొని జట్లను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా బ్రహ్మానందం కూతకొచ్చినప్పుడు 'బ్రహ్మీ.. బ్రహ్మీ..' అంటూ కేకలు వేశారు. ఓ సందర్భంలో 'మోహన్‌బాబూ.. అదీ డిసిప్లేన్‌ అంటే..' అంటూ అభినందించారు. బ్రహ్మానందం, అలీ, సంపూర్ణేష్‌బాబు కూతకు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది.

    Brahmanandam Playing kabadi


    అలాగే... 'నన్ను కొట్టడానికి ప్లాన్‌ చేశారు...' అంటూ విష్ణు మోహన్‌బాబుకి ఫిర్యాదు చేశారు. విరామ సమయంలో 'ఇక్కడ అన్యాయం జరుగుతోంది...' అంటూ మోహన్‌బాబుపై సరదాగా విరుచుకు పడ్డారు బ్రహ్మానందం. అందువల్ల మనోజ్‌ టీమ్‌ నుంచి క్రమశిక్షణ చర్యగా రెండు పాయింట్లు కోత విధించారు. హీరోయిన్ తేజస్వి (మనోజ్‌ టీమ్‌) కూతకు వెళ్లి రెండు పాయింట్లు సంపాదించి పెట్టింది.

    ఉత్తరాంధ్ర హుద్‌హుద్‌ పెను తుపాను బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ‘మేము సైతం' అంటూ కదిలింది. చిత్రసీమకు చెందిన పలు శాఖలవారు ఒక్కటై చేసిన ‘మేము సైతం' కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పన్నెండు గంటల వరకు ఆద్యంతం వినోదభరితంగా, కన్నులపండువగా జరిగింది.

    ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగగా, ఆ తర్వాత నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో కబడ్డీ, క్రికెట్‌ పోటీలు జరిగాయి. ఎనిమిదేళ్ల క్రితం అత్యంత వైభవంగా జరిగిన తెలుగు చిత్రసీమ వజ్రోత్సవాల అనంతరం పరిశ్రమలోని అత్యధికులు పాల్గొన్న కార్యక్రమం ‘మేము సైతం' అని చెప్పాలి.

    ఈ కార్యక్రమం ద్వారా హుద్‌హుద్‌ బాధితులకు చిత్రసీమ ఎంత అందజేస్తుందన్నది ముఖ్యం కాదనీ, తాము అందించిన స్ఫూర్తిని మాత్రమే చూడాలని దాసరి నారాయణరావు తెలిపారు. చిత్రసీమ యావత్తూ ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని మోహన్‌బాబు చెప్పగా, తెలుగువాళ్లకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, నేనున్నానంటూ చిత్రసీమ భరోసానిస్తూ వచ్చిందని బాలకృష్ణ అన్నారు.

    English summary
    Bramahnandam Playing Kabaddi Funny at Memu Saitam Event. Tollywood’s special event for Hudhud victim relief fund “Memu Saitham – We Love Vizag”. This 12 hours nonstop grand event will be a memorable one. It will be a eye feast for Tollywood fans to see all the stars on one stage. The event is full of entertainment with special skits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X