డైరక్టర్ సీట్లో బ్రహ్మానందం...హీరోగా సుబ్బరాజు

పోకిరిలో బ్రహ్మానందం చేత బ్రహ్మి ..సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనే పాత్ర చేయించి ప్రశంసలు అందుకున్న ఈయన ఈ చిత్రంలో బ్రహ్మానందంను దర్శకుడుగా చూపనున్నాడు. ఇక ఈ పాత్ర రియాలిటీ టచ్ తో ఉంటుందని.. చిత్ర పరిశ్రమలో పాతుకుపోయిన చాలా మంది సీనియర్ దర్శకుల అహంకారంను ప్రెజెంట్ చేస్తుందని తెలుస్తోంది. అయితే పూరీ మాత్రం నవ్వులే నా లక్ష్యం అంటున్నారు. ఇక సుబ్బరాజు అంటే పూరీకి ప్రత్యేకమైన అభిమానం. దాంతోటే అతన్ని హీరోగా ఈ చిత్రంలో చూపుతున్నాడని తెలుస్తోంది. ఏదైమైనా బ్రహ్మానందం మనకున్న సీనియర్ హాస్య నటుల్లో ఒకరు. అంతేగాక మంచి విద్యావంతుడు. రకరకాల అంశాలపై పూర్తి స్ధాయి అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి ఆయన నిజంగా డైరక్షన్ చేసినా బాగుంటుందనేది సినీ అభిమానుల ఆలోచన.


Click it and Unblock the Notifications











