twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వులే నవ్వులు: ‘ఆగడు’ బ్రహ్మానందం పాత్ర ఏమిటంటే..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఒకసారి మూడేళ్లు వెనక్కి వెళితే...2011 సెప్టెంబర్లో శ్రీను వైట్ల వచ్చిన ‘దూకుడు' చిత్రంలో మహేష్ బాబుతో కలిసి ‘పద్మశ్రీ' పాత్రంలో బ్రహ్మానందం పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. చంపక్ సేట్ క్యారెక్టర్లో బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయి అంటూ థియేటర్లో నవ్వుల జడివాన కురిపించారు ప్రేక్షకులు.

    హైదరాబాద్

    తాజాగా మహేష్ బాబు, శ్రీను వైట్ల, బ్రహ్మానందం కాంబినేషన్ ‘ఆగడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం ‘డిల్లీ బాబు' పాత్రలో కామెడీ దున్నేయ బోతున్నారు. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ దూకుడును మించి పోయేలా ఉంటుందని అంటున్నారు. మరిఇంకెందుకు ఆలస్యం...రేపు కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి సిద్దంగా ఉండండి.

    ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం. ‘ఆగుడు' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు' చిత్రంలో తమన్నా హీరోయి‌న్‌గా చేస్తోంది. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    English summary
    It is heard that Comedian Brahmanandam will be seen in a full length role in Aagadu as Dilli (Delhi) Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X