'శ్రీరామ రాజ్యం'లో బ్రహ్మానందం పాత్ర

By Srikanya

బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చాకలి తిప్పడు.ఈ విషయమై బ్రహ్మానందం మాట్లాడుతూ "ఇందులో చాకలి తిప్పడు పాత్ర వేశా. వాల్మీకి పాత్రకు అక్కినేని దొరకడం అదృష్టం. ఆ రోజుల్లో నాగయ్య వేసిన పాత్రని తత్తుల్యమైన నటుడు అక్కినేని ఇప్పుడు వేయడం ఆనందకరం. రాముని సంకల్పం వల్లే ఖర్చుకి వెనకాడకుండా తీశారు సాయిబాబు. రామాయణం గురించి అందరికీ తెలియజేయాలని బాపు దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. బాలయ్యను చూస్తే రామారావుగార్ని చూసిన భావం కలిగింది. బాలయ్య నటన చిరస్మరణీయంగా నిలుస్తుంది'' అన్నారు.

అలాగే లక్ష్మణ పాత్రధారి శ్రీకాంత్ మాట్లాడుతూ "చిన్నప్పట్నించీ పౌరాణిక చిత్రాలంటే ఇష్టం. తొలిసారి పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం చేశా. అలాగే బాలకృష్ణతో తొలిసారి చేశా. ఓ మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమా తియ్యాలంటే నిర్మాతకి గట్స్ ఉండాలి. సాయిబాబుకి హేట్సాఫ్'' అన్నారు. రాముడి పాత్రలో తాను ఎలా ఉంటానోనని ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని హీరో బాలకృష్ణ చెప్పారు. అలాగే త్వరలోనే అన్ని హంగులూ పూర్తిచేసుకుని చిత్రం విడుదల కాబోతంది. తెలుగు చూడాలంటే బాపు, తెలుగు వినాలంటే రమణ. ఈ సినిమాకి అద్భుతంగా రమణగారు రచన చేస్తే, అంత అద్భుతంగా బాపుగారు రూపొందించారు. సాయిబాబు ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X