బ్రహ్మానందంకు అస్వస్థత... ముంబైలో గుండెకు శస్త్ర చికిత్స!
Recommended Video

ప్రముఖ తెలుగు కమెడియన్ బ్రహ్మానందం అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయనకు గుండె నొప్పి రావడంతో ముంబైలోని షియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సోమవారం గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు.
బ్రహ్మానందం హార్ట్ సర్జీరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వైద్యుడు రమాకాంత పండా నేతృత్వంలోని వైద్యులు ఆయనకు చికిత్స చేశారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కొన్ని రోజులు ఆయన ముంబైలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని సన్నిహితులు తెలిపారు.

బ్రహ్మానందం విషయం తెలిసి షాకైన ఫ్యాన్స్
బ్రహ్మానందం అస్వస్థతకు గురైన విషయం తెలిసి అభిమానులు షాకయ్యారు. వెంటనే సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పోస్టు చేస్తున్నారు.

అందుకే రహస్యంగా...
సోమవారమే బ్రహ్మానందంకు శస్త్ర చికిత్స జరిగినప్పటికీ.... అభిమానులు కంగారు పడతారనే ఈ విషయాన్ని రహ్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. బుధవారం ఈ విషయం మీడియాకు తెలియజేశారు.

తెలుగు సినీ ప్రముఖుల పరామర్శ
పలువురు తెలుగు సినీ ప్రముఖులు బ్రహ్మానందం ఆరోగ్యం గురించి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుడు ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది.

అభిమానుల ప్రేయర్
పలువురు అభిమానులు బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలు బాగా తగ్గించేసిన ఈ కామెడీ స్టార్... ఆరోగ్యం సరిగా లేక పోవడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నారు.


Click it and Unblock the Notifications











