For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇదేం కామెడీ? :బ్రహ్మానందం మెయిన్ హీరో, రామ్ సెకండ్ హీరో

  By Srikanya
  |

  హైదరాబాద్ : సెకండాఫ్ లో బ్రహ్మానందం ఎంట్రీ ఇవ్వటం, హీరో..బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టి విలన్స్ ని బకరా చేసి హిట్ కొట్టడం అనే స్కీమ్ ని తెచ్చింది శ్రీను వైట్ల. అయితే అది ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. త్రివిక్రమ్ తో సహా చాలా మంది దర్శకులు అదే స్కీమ్ ని ఫాలో అవుతున్నారు...హిట్ లు కొడుతున్నారు. వరస ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్ సైతం ...లౌక్యంలో అదే ఫార్ములా వర్కవుట్ చేసి హిట్టయ్యాడు. దాంతో హ్యాట్రిక్ ఫ్లాఫ్ లు ఇచ్చిన రామ్ తన తాజా చిత్రానికి అదే స్కీమ్ ని ఎన్నుకున్నట్లు కనపడుతోంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రీసెంట్ గా .. రామ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం 'పండగ చేస్కో' ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన వారు...అందులో హీరో కన్నా బ్రహ్మానందానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ట్రైలర్ కట్ చేయటం చూసి షాక్ అయ్యారు. హీరో బ్రహ్మానందం, రామ్ సెకండ్ హీరో అన్నట్లుగా ఉందనే కామెంట్స్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఎక్కడ చూసినా కనపడున్నాయి.

  ఈ చిత్రంలో బ్రహ్మానందం..వీకెండ్ వెంకట్రావ్ గా కనపడనున్నారు. సల్మాన్ ఖాన్ కిక్ సినిమాను గుర్తు చేసే విధంగా స్పీడుగా వస్తున్న రైల్వే ట్రైక్ ని బ్రహ్మానందం దాటుతున్నట్లు...స్ఫూఫ్ లా డిజైన్ చేసి ట్రైలర్ వదిలారు. మీరు ఓ సారి ఈ ట్రైలర్ ని చూసి ఇది నిజమో కాదో గమనించండి.

  రామ్ ఈ విషయం గమనించాడో లేదో కానీ మరి బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టి ఒడ్డుకు చేరాలనే ఆలోచనతో రామ్ ముందుకు వెళ్తున్నాడనే కామెంట్స్ వినపడుతున్నాయి. అవి రామ్ అభిమానులను కాస్త ఇబ్బంది పెడుతున్నాయనేది వాస్తవం. అయితే జనాలకు కావాల్సింది వినోదం. హీరో రామ్ కు కావాల్సింది హిట్. అది బ్రహ్మానందం ద్వారా అయితే ఏంటి..రామ్ ద్వారా అయితే ఏంటి అంటారా...నిజమే మరి. అందరూ హీరోలు అదే చేస్తున్నప్పుడు రామ్ ని ప్రత్యేకంగా అనేదేముంది.

  రామ్‌ హీరోగా నటించిన చిత్రం 'పండగ చేస్కో'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ కథా నాయికలు. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు హైదరాబాద్‌లో రీసెంట్ గా విడుదలయ్యి అందరి మన్ననలూ పొందుతన్నాయి.

  Brahmanandam’s comic Salman Khan take

  రామ్‌ మాట్లాడుతూ ''ఇలాంటి కథ దొరకడం నా అదృష్టం. ఈ సినిమాని గోపీచంద్‌ మలినేని మరో స్థాయికి తీసుకెళ్లారు. తమన్‌ అందించిన ఐదు పాటలూ బాగున్నాయి. చాలా గ్యాప్‌ తరవాత చేస్తున్న సినిమా ఇది. ఈ విరామంలో మరో మూడు కథలు సిద్ధం చేసుకొన్నా. త్వరలోనే వాటితో మళ్లీ మీముందుకొస్తా'' అన్నారు.

  ''రామ్‌ ఎనర్జీని మరో కోణంలో చూపించే సినిమా ఇది. తెలుగు చిత్రసీమకు రకుల్‌ మరో అనుష్క అవుతుంది. కుటుంబమంతా కలసి చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము''అన్నారు దర్శకుడు. ''సినిమాలో రామ్‌ ఆకలిగొన్న పులిలా కనిపించాడు''అని బ్రహ్మానందం చెప్పారు.

  రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

  English summary
  The trailer of Pandaga Chesuko, which has Ram and Rakul Preet Singh in the lead, released on Saturday. Top comedian Brahmanandam plays an interesting character called Weekend Venkat Rao in the film and the trailer shows him crossing a railway track as a running train can be seen from behind just like Salman Khan did in Kick.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X