బ్రహ్మీ ‘గజదొంగ’ వేషాలు...
టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం 'గజదొంగ'గా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. భవాని మూవీస్ బ్యానర్ పై యు.శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మీ టైటిల్ రోల్ చేస్తుండగా... చైతన్య, ప్రకృతి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది . ఆర్ ఎస్ సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వైజాగ్ సత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, మరుధూరి రాజా కెమెరా స్విచ్ ఆన్ చేసారు, సురేష్ దర్శకత్వంలో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు .
దర్శకుడు సురేష్ మాట్లాడుతూ...దర్శకుడిగా నాకిది మొదటి చిత్రం. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీ రోల్ పోషిస్తున్నారు. కామెడి నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుంది.ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది . 3 షెడ్యుల్లో సినిమాని పూర్తిచేస్తాము అని అన్నారు .
నిర్మాత మాట్లాడుతూ..బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్ నారాయణ వంటి ఆర్టిస్టులతో ఓ కామెడి సినిమా చేయాలనేది నా కోరిక , ఆ కోరికను ఈ గజదొంగ చిత్రం ద్వారా తీర్చుకుంటునాను. గజదొంగ గా బ్రహ్మానందం నటిస్తున్నారు. ఆయన చుట్టూ ఈ కధ తిరుగుతుంది . మా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు .
బ్రహ్మానందం, చైతన్య, ప్రకృతి , జీవా, ధనరాజ్ , రఘుబాబు , అలీ, కొండవలస, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కధ : శ్రీనివాస్ డి , మాటలు:మరుధూరి రాజా, కెమెరా: రాహుల్ , ఎడిటింగ్: ఉపేంద్ర , నిర్మాత: యు శ్రీనివాస్, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఆర్ ఎస్ సురేష్.
మరో వైపు బ్రహ్మీ వెన్నెల కిషోర్ దర్శకత్వంలో జఫ్ఫా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం కామెడీకి మంచి డిమాండ్ ఉండటంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన్నే లీడ్ గా పెట్టి పలు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











