ఆ హీరో నన్ను డాడీ అని పిలుస్తాడు:బ్రహ్మానందం
పరిశ్రమలో బ్రహ్మానందానికి మంచి క్రేజ్ ఉండటే కాదు..మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి.ఈ విషయం ప్రస్దావిస్తూ ...జేడీ నన్ను డాడీ అని పిలుస్తారు అన్నారు బ్రహ్మానందం.బ్రహ్మానందం ప్రధాన పాత్రలో 'మనీ మనీ'సీక్వెల్ గా 'మనీ మనీ మోర్ మనీ'రెడీ అవుతోంది.ఈ చిత్రానికి జేడీ చక్రవర్తి దర్శకుడు.ఈ చిత్రానికి సంభందించి ప్రోమోలను నిన్న (శనివారం)రాత్రి విడుదల చేసారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే..పన్నెండేళ్ల తరవాత మనీ రెండు భాగాలకీ కొనసాగింపు చేయడం తేలికైన విషయం కాదు. దర్శకుడిగా జేడీ చక్కగా చిత్రాన్ని రూపొందించారన్నారు బ్రహ్మానందం.దర్శకుడు జేడీ మాట్లాడుతూ..ఈ చిత్రంలో బ్రహ్మానందం కరాటే, జూడో, స్నేక్ డ్యాన్స్ చేశారు. ఆ వింతలేమిటో తెర మీదే చూడాలని అన్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు రెండో వారంలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.


Click it and Unblock the Notifications











