Brahmanandam Son: డాక్టర్‌తో బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. సీఎంతోపాటు ఎవరెవరు వచ్చారంటే?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్య నటుడిగా మోస్ట్ పాపులర్ అయ్యారు బ్రహ్మానందం. ఆయన్ను హాస్యబ్రహ్మా అనడంలో కూడా సందేహం లేదని అభిమానులు అంటుంటారు. స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి తన హావా భావాలతో ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఆయనకు ఉన్న పేరును ఎవరు భర్తీ చేయలేరు.
సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో మీమ్స్ తో సైతం ఆయన కామెడీ రథం కొనసాగుతోంది. అయితే తాజాగా ఆయన రెండో కుమారుడి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

ప్రతిదానికి ఎక్స్ ప్రెషన్: తెలుగు ప్రేక్షకులను ఎక్స్ ప్రెషన్స్, పాటలు పాడి (పాత్రల రూపంలో), స్టెప్పులేసి ఎంతగానో నవ్వించారు హాస్య నటులు బ్రహ్మానందం. అనేక వేల చిత్రాల్లో నటించి భవిష్యత్తులో చెరగని, తనకు సాటిరాని హాస్యాన్ని పండించారు. సినిమాల తర్వాత మొన్నటి వరకు చాలా గ్యాప్ తీసుకున్న ఆయన హాస్యం సోషల్ మీడియాలో మీమ్స్ తో నిత్యం ఎంటర్టైన్ చేశారు. ఇప్పటికీ ప్రతి సంఘటనకు ఆయన ఎక్స్ ప్రెషన్ తో ఓ మీమ్ ఉంటుంది. అంతలా ఆయన ప్రాచుర్యం పొందారు.

అలా ఎంట్రీ: బ్రహ్మానందం ఇటీవల వాంటెడ్ పండుగాడ్, పంచతంత్ర వంటి చిత్రాల్లో దర్శనం ఇచ్చారు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో ఊహించని విధంగా సీరియస్ పాత్ర చేసి ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించారు. ఇదిలా ఉంటే బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గౌతమ్ సినీ పరిశ్రమలోకి పల్లకిలో పెళ్లి కూతురు చిత్రంతో హీరోగా అడుగుపెట్టగా తర్వాత అంతగా సక్సెస్ కాలేకపోయాడు.

నిశ్చితార్థానికి: కొంత గ్యాప్ తర్వాత బాసంతి, చారుశీల, మను వంటి చిత్రాల్లో నటించిన గౌతమ్ కు హీరోగా అంతగా గుర్తింపు దక్కలేదు. ఇక బ్రహ్మాందం రెండో కుమారుడు సిద్ధార్థ్. విదేశాల్లో పైచదువులు చదువుకున్న సిద్ధార్థ్ కు సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని సమాచారం. అందుకే ఫారెన్ లో హై స్టడీస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తోంది. సిద్ధార్థ్ నిశ్చితార్థం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కమెడియన్ అలీ, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రముఖుల హాజరు: తాజాగా బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా-వినయ్ దంపతులు కుమార్తె డాక్టర్ ఐశ్వర్యతో సిద్ధార్థ్ పెళ్లి భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ మాత్రమే కాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ విచ్చేశారు.
సినీ పరిశ్రమ నుంచి: ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదితరులు హాజరై నూతన వధూవరులు సిద్ధార్థ్-ఐశ్వర్యలను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











