షాక్ ఇస్తున్న బ్రహ్మానందం రెమ్యూనరేషన్!
హైదరాబాద్: సినిమా ఏ హీరోది అయినా... ఆ సినిమాకు దర్శకుడు ఎవరైనా..... ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే సగటు ప్రేక్షకులు ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడా? లేడా? అని ముందుగా ఆలోచించే పరిస్థితి ఏర్పడిదంటే బ్రహ్మానందం రేంజి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సినిమా హిట్ కావాలంటే అందులో బ్రహ్మీ కామెడీ ఉండి తీరాల్సిందే.
కొందరు స్టార్ హీరోలు బ్రహ్మీ డేట్స్ దొరికే వరకు తమ సినిమాలను వాయిదా వేసుకుంటారంటే అతిశయోక్తి కాదు. మరి అంత డిమాండ్ ఉన్న కామెడీ స్టార్‌కు రెమ్యూనరేషన్ ఏ రేంజిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి మాత్రం నిజం. మీ ఆలోచనలకు అందనంత ఎత్తులో బ్రహ్మీ రెమ్యూనరేషన్ ఉందనేది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం బ్రహ్మీనందం రెమ్యూనరేషన్ రోజుకు రూ. 6 లక్షలుగా ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన బ్రహ్మీ ఆదాయం ఎంతో అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమలో నెం.1 రేంజిలో ఉన్న ఒక స్టార్ హీరో 100 రోజుల కాల్ షీట్ ఇస్తే దాదాపు రూ. 10 నుంచి 15 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ లెక్క ప్రకారం బ్రహ్మీ రెమ్యూనరేషన్ కూడా స్టార్ హీరోల రేంజికి ఏమాత్రం తగ్గకుండా ఉందని స్పష్టమవుతోంది.
బ్రహ్మానందం సంవత్సారానికి సగటున 15 నుంచి 20 సినిమాల్లో నటిస్తారు. దీంతో ఆయన డేట్స్ సంవత్సరం మొత్తం బిజీగానే ఉంటున్నాయి. దీంతో స్టార్ హీరోల సినిమాలు బ్రహ్మీ డేట్స్ కు అనుగుణంగా షెడ్యూల్ చేయబడుతున్నాయట. అదండీ మన టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మీనందం రేంజి...


Click it and Unblock the Notifications











