'వారెవా...' అంటున్న బ్రహ్మానందం కొడుకు
బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా చేస్తున్న చిత్రానికి 'వారెవా...' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం ద్వారా శాంభవి హీరోయిన్ గా, కళ్యాణ్ మంతెన దర్శకునిగా పరిచయమవుతున్నారు. మూవీ మిరాకిల్స్ పతాకంపై మహేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మితమవుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో నిరాడంబరంగా ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి తులసి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. బ్రహ్మానందం పూజా కార్యక్రమాలు నిర్వహించగా, బేబీ గీతాంజలి స్క్రిప్టుని దర్శకునికి అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ మంతెన మాట్లాడుతూ -"కళాశాల నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. గౌతమ్ పాత్ర సరదాగా సాగిపోతూ అందర్నీ ఆకట్టుకుంటుంది' అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -"మే 3 నుంచి చిత్రీకరణ జరుగుతుంది. మే, జూన్, జూలై నెలల్లో హైదరాబాద్, వైజాగ్, గోవాల్లో టాకీపార్ట్ చిత్రీకరిస్తాం. ఆగస్టులో పాటల చిత్రీకరణ చేస్తాం. అక్టోబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు.
ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, దేవన్, సయాజీషిండే, డా.బ్రహ్మానందం, జీవా, వేణుమాధవ్, మాస్టర్ భరత్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ప్రగతి, సురేఖావాణి, శ్రావణ్, సమీర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహేష్ శంకర్, సాహిత్యం: వేటూరి, కేథరనాథ్, ఆర్ట్: నారాయణరెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, కో-డైరెక్టర్: కె.హరికృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్, సహ నిర్మాతలు: సీహెచ్. వెంకట రెడ్డి, జానకిరామ్ (జాని), సమర్పణ: శ్రీమతి తులసి.


Click it and Unblock the Notifications











