బ్రహ్మానందం కొడుకు ‘వీర్యం’ డోనర్ గా..?
తద్వారా వచ్చే డబ్బుతో ప్యాకెట్ మనీ కింద ఉపయోగించుకోవడం మొదలు పెట్టి రాను రాను దాన్నే తన వృత్తిగా చేసుకుంటాడు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈచిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. వీర్యం అనేగానే ఇదో బూతు సినిమా అనుకున్నారు కానీ ఆతర్వాత అది మామూలు సినిమా అని తేలడం, మంచి సబ్జెక్టు కావడంతో ఆదరణ బాగానే లభించింది.
తాజాగా ఈచిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం తనయుడు గౌతం నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకు ముందు రెండు మూడు సినిమాలు చేసి ప్లాపులు చవి చూసిన గౌతం చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు. వికీ డోనర్ సబ్జెక్టు కొత్తగా ఉండటం, మంచి గుర్తింపు వచ్చే విధంగా ఉండటంతో ఈ సినిమా అయినా తనను కనీసం చిన్న హీరోగా అయినా నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నాడట గౌతం. అయితే ఈచిత్రానికి దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












