twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం కొడుకు ‘వీర్యం’ డోనర్ గా..?

    By Bojja Kumar
    |

    వీర్య దానం, అద్దెగర్భం గురించి చర్చించే కాన్సెప్టుతో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'వికీ డోనర్'. రోజు రోజుకు జనాభా పెరిగి పోతున్న ఈదేశంలో తమ కడుపున ఒక్క నలుసు కూడ పండని తల్లదండ్రులు, పిల్లల కోసం అల్లాడి పోతున్న దంపతులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం వీర్యం దానం చేస్తుంటాడు ఈ చిత్రంలోని హీరో.

    తద్వారా వచ్చే డబ్బుతో ప్యాకెట్ మనీ కింద ఉపయోగించుకోవడం మొదలు పెట్టి రాను రాను దాన్నే తన వృత్తిగా చేసుకుంటాడు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈచిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. వీర్యం అనేగానే ఇదో బూతు సినిమా అనుకున్నారు కానీ ఆతర్వాత అది మామూలు సినిమా అని తేలడం, మంచి సబ్జెక్టు కావడంతో ఆదరణ బాగానే లభించింది.

    తాజాగా ఈచిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం తనయుడు గౌతం నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకు ముందు రెండు మూడు సినిమాలు చేసి ప్లాపులు చవి చూసిన గౌతం చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు. వికీ డోనర్ సబ్జెక్టు కొత్తగా ఉండటం, మంచి గుర్తింపు వచ్చే విధంగా ఉండటంతో ఈ సినిమా అయినా తనను కనీసం చిన్న హీరోగా అయినా నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నాడట గౌతం. అయితే ఈచిత్రానికి దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

    English summary
    Top comedian Brahmanandam's son Gautam is all set to test his luck once again with an upcoming movie that deals with Sperm Donation. Sources revealed that recent Hindi movie 'Vicky Donor' is the inspiration behind this flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X