పవన్ పంజాలో బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించే స్పెషల్ సాంగ్...!
విష్ణువర్థన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న'పంజా" చిత్రంలో బ్రహ్మానందం ఓ స్పెషల్ సాంగ్ చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బ్రహ్మి పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ గెటప్ లో బ్రహ్మానందం ఫుల్ కామెడీ పండించాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గంభీరమైన గెటప్ చూసి ఈ సినిమా చాలా సీరియస్ గా ఉంటుందని ఊహించుకుంటున్నారు. బ్రహ్మీ పేరడీ సాంగ్ నిజంగా ఉందా లేదా తెలియాలంటే 'పంజా' సినిమా విడుదల అయ్యేవరకూ ఆగాల్సిందే. కానీ బ్రహ్మానందం కామెడీతో పాటు ఇద్దరు కథానాయికలతో పవన్ రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఫుల్లుగా అలరిస్తాయనే వార్తలు అందుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పంజా" చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను ఈ నెల 13న గచ్చిబౌలి స్టేడియంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుక వాయిదా పడే అవకాశముందనే వార్తలు అందుతున్నాయి. మొదట నవంబర్ 13న పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ అనుకున్నారు. కానీ అనుకోకుండా నవంబర్ 19కు వాయిదా వేయనున్నారని తాజాగా అందిన సమాచారం.


Click it and Unblock the Notifications











