సునీల్ ఉంటే మాకు అవకాశాలుండేవి కావు, గొడ్డులా... : బ్రహ్మానందం

By Bojja Kumar

Recommended Video

Brahmanandam Speech @Silly Fellows Movie Pre Release Event

టాలీవుడ్ కామెడీ స్టార్స్ అల్లరి నరేష్, సునీల్ ప్రధాన పాత్రల్లో భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సిల్లీ ఫెల్లోస్' సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ కాస్త గ్యాప్ ఇవ్వడం వల్లనే మేమంతా ఇండస్ట్రీలో ఉన్నాం... లేక పోతే ఎప్పుడో పెట్టాబేడా సర్దుకుని వెళ్లేవారమని వ్యాఖ్యానించారు.

ఈవివి-త్రివిక్రమ్ కలిసినట్లు...

ఈవివి-త్రివిక్రమ్ కలిసినట్లు...

నరేష్, సునీల్ ఈ ఇద్దరిలో ఒకరు ఉంటేనే తట్టుకోవడం కష్టం... ఈ ఇద్దరూ కలిశారంటే కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈవివి సత్యనారాయణ-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ‘సిల్లీ ఫెలోస్' ఉంటుందని బ్రహ్మానందం అన్నారు.

నరేష్ ఒళ్లు ఇరగ్గొట్టుకునే రకం కాదు

నరేష్ ఒళ్లు ఇరగ్గొట్టుకునే రకం కాదు

నరేష్ తనకంటూ కామెడీ పరంగా ఓ స్టైల్ ఏర్పరచుకున్నాడు. ఏదో కామెడీ చేయాలి కాబట్టి మనం ఏదో చేసి నవ్వించేద్దాం, దీనికి ఒళ్లంతా ఇరగ్గొట్టుకుందామనే ఆలోచన అతడికి మొదటి నుండీ లేదు. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తాడు... అని బ్రహ్మానందం తెలిపారు.

సునీల్ గ్యాప్ ఇచ్చాడు, లేక పోతే..

సునీల్ గ్యాప్ ఇచ్చాడు, లేక పోతే..

ఇక సునీల్ గురించి చెప్పాలంటే.... లక్కీగా మాకు కొంత గ్యాప్ ఇచ్చాడు. లేక పోతే మేమంతా ఎప్పుడో పెట్టాబేడా సర్దుకోవాల్సినోళ్లం. ఆయన కొంతకాలం హీరోగా చేస్తూ అటు వైపు వెళ్లిపోవడం వల్లనే మేము ఇండస్ట్రీలో ఉన్నామని బ్రహ్మానందం చమత్కరించారు.

గొడ్డలా పని చేస్తాడు

గొడ్డలా పని చేస్తాడు

హీరోగా బోలెడన్ని సినిమాలు చేసి, హీరోగా ఉంటూ కూడా కామెడీ సినిమాలు చేసి... ఎప్పుడు మాట్లాడినా అన్నయ్యా నేను కామెడీ మర్చిపోను, అది నా జీవితం, అదినా ఆక్సీజన్ అని కష్టపడి పైకొచ్చిన వ్యక్తుల్లో సునీల్ ఒకరు. మిగతా కమెడియన్ల గురించి నేను చెప్పలేను కానీ నాకు కొంచెం బద్దకం ఎక్కువ. కానీ సునీల్ గొడ్డులా పని చేస్తాడు. ఎంత పని ఉన్నా, ఎంత కష్టమైనా, ఎంత బాధ ఉన్నా భరిస్తాడు అని వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X