సుబ్బరామి రెడ్డి లాంటి వారికి మరణం లేదు: బ్రహ్మనందం

కళాబంధు, డా.టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రధానం చేసి సత్కరిస్తారు. గత 20ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖ నటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సంధర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అభినయ మయూరి బిరుదు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు విచ్చేశారు. సీనియర్ నటి జమున, అలనాటి హీరోయిన్ రాధిక, ఎమ్మెల్యే రోజా, జీవిత, శారద, గాయని పి. సుశీల అలాగే మురళీ మోహన్, రాజశేఖర్, శరత్ కుమార్,బ్రహ్మానందం లతో పాటు ఈ కార్యక్రమంలో టీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ..*సుబ్బరామిరెడ్డి గారి ప్రతీ పుట్టినరోజు వేడుకలకు మేము వస్తామని, ఒక మనిషికి ఒక్క కోణంలో కాకుండా ఎన్నో కోణాల్లో ఉండే మనిషిని చూడాలంటే సుబ్బరామిరెడ్డి గారిని చూస్తే సరిపోతుందని అన్నారు. ఆయనకు ఈ విశాఖ పట్నానికి ఎంతో అనుబంధం ఉందని అన్నారు, 14సంవత్సరాల నుంచి పుట్టిన రోజు వేడుకలకు ఆయన మా మీద చూపించే ప్రేమ వల్లే వస్తున్నామని అన్నారు. శివనామస్మరణ చేయకుండా ఆయన ఉండలేరని, నటరాజ స్వరూపం ప్రతీవారిలో చూసే వ్యక్తి టీఎస్ఆర్ గారని అన్నారు. కళాకారుడికి పూజ చేసుకుని మంచి చేసే వ్యక్తి ఆయన అన్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడిన, ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడుతూ.. అందరికీ కావలసినవి చేస్తారని చెప్పారు.

Brahmanandam speech at TSR Birthday Celebration

ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే మాములు విషయం కాదు. అన్ని మతాల వారిని తీసుకుని వచ్చారని అన్నారు. సమాజంలో ఉండే అతి తక్కువ వ్యక్తుల్లో రత్నం లాంటి వ్యక్తి సుబ్బరామి రెడ్డి అని అన్నారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, సుబ్బరామి రెడ్డి లాంటి వారికి మరణం లేదన్నారు. ప్రతీ సంవత్సరం ఉగాది, శ్రీరామ నవమి లాగా సుబ్బిరామి రెడ్డి పుట్టినరోజు ప్రతీ సంవత్సరం చేసుకునేందుకు వస్తామని అన్నారు. భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడు సుబ్బరామిరెడ్డి అని బ్రహ్మానందం అన్నారు.

రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ టీఎస్సార్‌ జన్మదిన వేడుకలు తెలుగు పండుగతో సమానమన్నారు. చాలా మంది ప్రముఖులు ఆయన జన్మదినం కోసం విశాఖకు వస్తారన్నారు.

నటి ఉర్వశి శారద మాట్లాడుతూ టీఎస్సార్‌ చాలా మందికి సహాయం చేస్తారని కాని ఆవిషయం ఎప్పుడు చెప్పుకోని గొప్ప వ్యక్తి అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మాట్లాడుతూ అన్ని రంగాల్లో విజయం సాధించిన వ్యక్తి టీఎస్సార్‌ అన్నారు. వైజాగ్‌ అంటే మొదట బీచ్‌ ఆ తరువాత టీఎస్సార్‌ గుర్తుకు వస్తారన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X